Anil Ravipudi: చిరుతో సినిమా.. అనిల్ రావిపూడి ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?

ABN , Publish Date - Jan 19 , 2025 | 02:35 PM

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వరుసగా 8వ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో ఉండబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అనిల్ రావిపూడి కూడా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో చిరుతోనే తన తదుపరి ప్రాజెక్ట్ అని ప్రకటించారు. కానీ, తాజా ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన ట్విస్ట్.. ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. విషయం ఏమిటంటే..

Chiranjeevi and Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా సెట్స్‌పైకి రానున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌పై మాట్లాడుతూ.. తదుపరి తన సినిమా చిరుతోనే అన్నట్లుగా హింట్ ఇచ్చారు. అయితే ఆయన, తన తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌పై చేసిన వ్యాఖ్యలు అందరికీ షాకిచ్చాయి. ఏంటా షాక్? అనుకుంటున్నారా.. విషయంలోకి వస్తే..


మెగాస్టార్ చిరంజీవికి అనిల్ రావిపూడి కేవలం లైన్ మాత్రమే వినిపించాడట. ‘‘చిరంజీవి గారితో సినిమా ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఒక కథకి సంబంధించి లైన్‌ అనుకున్నాం. అది ఆయనకు నచ్చింది. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం..’ అయిపోయింది కాబట్టి దానిమీద వర్క్‌ చేయాలి. ఆయనకు చెప్పాలి. ఆ తర్వాత ఎప్పుడు టేకాఫ్‌ అవుతుందనే విషయాన్ని ప్లాన్‌ చేయాలి..’’ అని తాజాగా అనిల్ రావిపూడి ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా షాకవుతున్నారు.

Also Read- Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం


Anil-Ravipudi.jpg

కారణం, మెగాస్టార్ చిరంజీవికి స్టోరీ నచ్చాలంటే చాలా తతంగం ఉంటుంది. గతంలో పూరీ జగన్నాధ్ కూడా ఇలా లైన్ చెప్పి అంతా ఓకే చేయించుకుని పూర్తి కథ రాసుకుని ఆయన దగ్గరకు వెళితే.. సెకండాఫ్ నచ్చలేదంటూ చిరు రిజిక్ట్ చేసినట్లుగా స్వయంగా పూరీనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనిల్ కూడా కేవలం లైన్ ఓకే అయింది.. కథ మీద కూర్చోవాలి అంటున్నాడు. అంటే కథ ఓకే కావాలి. అది చిరుకి నచ్చాలి. అప్పుడు కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్‌కు వెళ్లదు. అంతా అనిల్ రావిపూడి చేతుల్లోనే ఉంది. అయితే అనిల్ రావిపూడి సామర్థ్యం తెలిసిన వారంతా.. కచ్చితంగా తన కథతో చిరుని మెప్పిస్తాడని, ప్రాజెక్ట్ ఓకే చేయించుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు. చూద్దాం.. ఏం జరగబోతోందో.. ఏం జరుగుతుందో!


Also Read-Manchu Manoj: నా పోరాటం ఎందుకంటే.. ఓహో ఇదన్నమాట అసలు విషయం!

Also Read-Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!

Also Read-Madhavi Latha: ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా.. మాధవీ లత షాకింగ్ కామెంట్స్

Also Read:Manchu Manoj: సింగిల్‌గా వస్తా.. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 19 , 2025 | 02:35 PM