Chai - Sobhita: హనీమూన్‌కి చెక్కేసిన జంట
ABN , Publish Date - Mar 07 , 2025 | 08:01 PM
నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్ళైన తర్వాత నుండి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. 'తండేల్' సినిమా షూటింగ్ పూర్తి కావడం, విడుదలై ఘన విజయాన్ని అందుకోవడంతో ఈ కొత్త జంట ఇప్పుడు విదేశాల్లో విహార యాత్ర చేస్తున్నారు.
రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సమంత (Samantha) తో విడాకుల తర్వాత రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జోడి డిసెంబర్ 4న కుటుంబసభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్ (Honeymoon) కంటే ప్రొఫెషన్ కే ప్రాధాన్యత ఇచ్చి నాగచైతన్య... 'తండేల్' (Thandel) షూటింగ్ ను పూర్తి చేశాడు. రీసెంట్ గా మూవీ గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో ఆ సంతోషాన్ని డబుల్ చేసుకునేలా... నాగచైతన్య భార్యతో కలిసి విదేశాలకు చెక్కేశాడు.
పెళ్లి తర్వాత చై, శోభిత ఇంటర్నేషన్ టూర్ కు వెళ్లిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రెజెంట్ యూరప్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను శోభిత షేర్ చేసుకున్నారు. అందమైన లోకేషన్స్ ను ఆస్వాదించడంతో పాటు నచ్చిన ఫుడ్ ను తింటూ ఎంజాయ్ చేయడంతో పాటు 'వైబ్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. సింపుల్ లుక్స్ లో కనిపించిన ఈ జోడీ ఫోటోలను చూసిన నెటిజన్లు కొత్త జంట క్యూట్ గా ఉందంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
త్వరలోనే నాగచైతన్య కొత్త సినిమాకు కమిట్ అవ్వనున్నాడు. కార్తీక్ వర్మ దండుతో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేయనున్నాడు. దీంతో మళ్లీ షూటింగ్స్ తో బిజీగా మారే ఛాన్స్ ఉండటంతో... భార్యతో సరదాగా గడిపేందుకు విదేశాలకు చెక్కేశాడు. ఇటు శోభిత కూడా బాలీవుడ్, వెబ్ సీరిస్ లు, హాలీవుడ్ మూవీలతో బిజీగా ఉంది. దీంతో షూటింగ్స్ కు గ్యాప్ రావడంతో భర్త తో కలిసి చిల్ అవుతోంది. మరోవైపు శోభితా, చై కాంబోలో ఒక మూవీ వస్తే చూడాలని ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Kingston Review: జీవీ ప్రకాశ్ 25వ సినిమా ఎలా ఉందంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి