పొట్టి గౌనులో పూనమ్ బజ్వా.. ఫెస్టివల్ మూడ్‌లో నయన్.. సోషల్ మీడియాలో తారల అప్డేట్స్ ఇవే..
ABN , Publish Date - Jan 15 , 2025 | 09:15 PM
సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్ అవుతూనే ఉంటుంది. వారొక ఫొటో పెట్టినా, వీడియో పోస్ట్ చేసినా.. అది ఫ్యాన్స్‌కి పండగే. ఆ పోస్ట్‌ని వెంటనే వైరల్ చేసే కార్యక్రమాన్ని అభిమానులు చూసుకుంటారు. మరెందుకు ఆలస్యం సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో ఓ లుక్ వేయండి..
పొట్టి గౌనులో పూనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్ ఇస్తే.. ఫెస్టివల్ మూడ్‌లో నయన్ నిండుగా కనిపించింది.
ప్రగ్యా జైస్వాల్ ఫిల్మ్ సక్సెస్ సంబరాల్లో మునిగితేలుతుంటే.. సంపత్ నంది వ్యవసాయానికి సిద్ధమయ్యారు.
భర్త నాగచైతన్యతో ‘సంక్రాంతి పండగ వైబ్స్’ శోభిత క్యాప్షన్ ఇస్తే.. లేట్ నైట్ పోస్ట్‌తో ట్రీట్ ఇచ్చింది పాయల్.
వన్ డే ఎట్ ఏ టైమ్ అంటూ కిస్సిక్ పాప శ్రీలీల కసి కసి చూపులతో కుర్రకారుని రెచ్చగొడుతుంటే.. తేజ సజ్జా ‘మిరాయి’ పోస్టర్‌తో దిగాడు.
రాశీ ఖన్నా చైల్డ్ మెమరీస్‌లోకి వెళ్లి వస్తే.. పూజా హెగ్డే మెమరీ బాక్స్‌కు పని కల్పించింది.
మొత్తంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఫెస్టివల్ మూడ్ నుండి ఇంకా బయటికి అయితే రాలేదు.