Sankranti: సంక్రాంతి స్పెషల్‌గా ఫ్యామిలీతో ఫొటోలను షేర్ చేసిన సెలబ్రిటీలు.. ఫొటోలు వైరల్
ABN , Publish Date - Jan 14 , 2025 | 11:39 PM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సెలబ్రిటీలు కొందరు తమ ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు బ్రదర్స్.. ఇలా ఎందరో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేశారు.
సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి జరుపుకునే పండుగ. అందుకే ఈ పండుగకి ఎక్కడెక్కడి వారంతా ఒక్కచోట చేరి.. ఎంతో హ్యాపీగా పండుగ జరుపుకుంటారు. అందుకే సంక్రాంతిని హిందువుల పెద్ద పండుగ అంటుంటారు. ఇక ఈ పండుగను పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేశారో తెలిపేలా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతిని ఎలా జరుపుకున్నారో తెలిపేలా వచ్చిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సంక్రాంతి పండుగకు ఫ్యామిలీతో సహా సెలబ్రిటీలు షేర్ చేసిన ఫొటోలను మీరూ చూసేయండి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. భార్య ఉపాసనతో పాటు కుమార్తె క్లీంకారతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో క్లీంకారకు భోగిపళ్లు పోసినట్లుగా కనిపిస్తుంది. ఈ ఫొటోను ఉపాసన షేర్ చేశారు.
అల్లు అర్జున్ తన ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అల్లు స్నేహ ఈ ఫొటోలను షేర్ చేశారు.
స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార పొంగల్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. భర్త, తన ఇద్దరి పిల్లలతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నట్లుగా ఆమె ఫొటోలను షేర్ చేశారు.
మంచు విష్ణు, తండ్రి మోహన్ బాబు సమక్షంలో ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతిని జరుపుకున్నారు. మంచు విష్ణు ఆ ఫొటోలను షేర్ చేశారు.
మంచు మనోజ్ సెపరేట్‌గా, తన ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్‌తో కలిసి పండుగను జరుపుకున్నారు. ఈ వేడుకలో సాయి దుర్గ తేజ్ కూడా భాగమయ్యారు.
హీరో సూర్య, హీరో శివకార్తికేయన్, రిషభ్ శెట్టి, హీరోయిన్ వితికా షెరు, జానీ మాస్టర్ వంటి వారంతా సోషల్ మీడియాలో సంక్రాంతి స్పెషల్‌గా ఫ్యామిలీతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు.