Vaishnavi Chaitanya: అసలే స్లిమ్‌.. ఇంకా నాజూగ్గా కావాలా

ABN , Publish Date - Jan 25 , 2025 | 02:06 PM

తాజాగా ఈ బ్యూటీకీ సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ అందాల తార ఎవరో అనుకుంటున్నారా? ఫ్రెండ్‌, సిస్టర్‌ క్యారెక్టర్స్‌తో కెరీర్‌ మొదలుపెట్టి హీరోయిన్‌గా మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ అందుకుంది. ఆ హీరోయిన్‌ మరెవరో కాదు.

తెలుగు అమ్మాయిలకు హీరోయిన్‌గా ఆఫర్లు చాలా తక్కువు. ఒకవేళ వచ్చినా ఈ రంగుల లోకంలో నెట్టుకు రావడం చాలాకష్టం. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు (tollywood heroines) చాలామంది సత్తా చాటుతున్నారు. అంజలి, ఐశ్వర్య రాజేశ్‌, వైష్ణవి చైతన్య, కావ్య కళ్యాణ్‌ రామ్‌, ఈషారెబ్బ వంటి ముద్దుగుమ్మలు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రపరిశ్రమలో సత్తా చాటుతుంది ఓ హీరోయిన్‌. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అటు వరుస సినిమాల్లో నటిస్తూనే ఫిట్‌నెస్‌ కోసం విపరీతంగా కష్టపడుతుంది.  జిమ్‌లో కసరత్తులు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీకీ సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ అందాల తార ఎవరో అనుకుంటున్నారా? ఫ్రెండ్‌, సిస్టర్‌ క్యారెక్టర్స్‌తో కెరీర్‌ మొదలుపెట్టి హీరోయిన్‌గా మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ అందుకుంది. ఆ హీరోయిన్‌ మరెవరో కాదు. అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)

యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా చాలా ఫేమస్‌ అయ్యింది వైష్ణవి చైతన్య. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ సిరీస్‌ ద్వారా సోషల్‌ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఈ అమ్మడు హీరోయిన్‌ గా నటించిన బేబీ చిత్రం కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో ప్రియుడిని మోసం చేసిన ప్రియురాలి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వైష్ణవికి ఒక్కసారిగా మంచి గుర్తంపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్‌ వచ్చాయి. బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది. బేబీ తర్వాత తను నటించిన పలు చిత్రాలు విడుదలై మంచి రెస్పాన్స్‌ అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె సిద్థు జొన్నలగడ్డతో కలిసి ఓ సినిమా చేస్తుంది.  Gym photos Viral)

Updated Date - Jan 25 , 2025 | 02:06 PM