Mohan Babu: మంచు ఫ్యామిలీ.. మరో రెండు కేసులు..
ABN , Publish Date - Jan 17 , 2025 | 01:26 PM
మంచు కుటుంబం మీద రెండు కేసులు చంద్రగిరి పోలీసులు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. డైరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటన పైన ఇరు వర్గాల మీద కూడా ఫిర్యాదు చేసిన ఆధారంగా రెండు కేసులు నమోదు చేసినట్లు చంద్రగిరి పోలీసుల నుంచి తెలిపారు.
గత నెల రోజులుగా మంచు కుటుంబంలో (Manchu Family) జరుగుతున్న రాద్ధాంతం గురించి తెలిసిందే. మాటకు, మాట, విమర్శలు, కేసులు ఇలా పెద్ద రచ్చే జరిగింది. మోహన్ బాబు(Mohan Babu), మనోజ్ (manoj) , విష్ణు (Vishnu) ఇలా ఒకరి మీద ఒకరు పలు కేసులు పెట్టుకుంటూ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మంచు కుటుంబానికి పెద్ద షాక్ తగిలినట్లు అయింది. ఏకంగా ఈ కుటుంబం మీద రెండు కేసులు చంద్రగిరి పోలీసులు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా డైరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటన పైన ఇరు వర్గాల మీద కూడా ఫిర్యాదు చేసిన ఆధారంగా రెండు కేసులు నమోదు చేసినట్లు చంద్రగిరి పోలీసుల నుంచి తెలిపారు. మోహన్ బాబు పిఎ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో అటు మంచు మనోజ్, మౌనికలతోపాటు మరో ముగ్గురిపైనా కేసు నమోదు అయినట్లు తెలిసింది. (Two Cases on manchu family)
ఇదే విషయంలో తనపై, తన భార్య మౌనికపై దాడికి దిగారంటూ మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్‌బాబు పీఏతో పాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ రెండు కేసుల పైన పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు పి.ఏ.చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు చేసిన వారిలో ఎ-1 గా మంచు మనోజ్ ఉండగా, ఎ2గా మౌనిక, ఎ3గా రెచి?్డ, ఎ4 గా పళనీ రాయల్, ఎ-5 గా పవన్ ఉన్నట్లు తెలిసింది. మనోజ్ ఫిర్యాదు చేసిన వారి లిస్టులో ఎ1గా విజయసింహ, ఎ2 గా సురేంద్ర, ఎ3గా బాలాజీ, ఎ4గా సారధి, ఎ5గా కిరణ్, ఎ6గా రవిశేఖర్, ఎ7గా హేమాద్రి, ఎ8గా జిమ్ చంద్రశేఖర్, ఎ9 యావ్స్ మనీ ఉన్నట్లు సమాచారం.