Anasuya Bharadwaj: దమ్ముంటే దగ్గరకు రారా.. ఏ ప్యాంట్ తడిచిందా..
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:55 PM
తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం’ అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులరో తెలిసిందే. ఇప్పుడు హాట్ యాంకర్ అనసూయ కూడా అలాంటి డైలాగే కొడుతుంది.
"తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం’ అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులరో తెలిసిందే. ఇప్పుడు హాట్ యాంకర్ అనసూయ (Anasuya) కూడా అలాంటి డైలాగే కొడుతుంది. అయితే ఇక్కడ చిన్న చేంజ్ ఉంది. తెలుగు, ఇంగ్లిష్.. హిందీ భాష ఏదైనా అనసూయకు నచ్చని ఏకైక పదం 'ఆంటీ'! ఈ మాట ఇప్పటిది కాదు.. కొన్నేళ్లగా ఇదే మాట చెబుతోంది అనసూయ. ఎవరు పడితే వారు ఆంటీ అంటే ఊరుకునేది లేదు.. అలా పిలవాలంటే నా బంధునివులై ఉండాలి, లేదా చిన్నపిల్లలై 9Anasuya aunti) ఉండాలని కుండ బద్దలుకొట్టి చెబుతోంది అనసూయ. ఆమె పలు మాధ్యమాల వేదికగా ఎన్ని సార్లు మొత్తుకున్నా యువత, నెటిజన్లు అంటీ అనే ఆమెను పిలుస్తుంటారు. సందర్భం కుదిరినప్పుడల్లా ప్రేమగా ఆంటీ అని పిలుస్తూ ఏడిపిస్తుంటారు.
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సెలబ్రిటీ హోలీ సెలబ్రేషన్స్‌లో (Anasuya Holi Celebrations) పాల్గొంది అనసూయ. అక్కడ ఓ ఆకతాయి ఆంటీ అని గట్టిగా పిలిచాడు. అది కాస్త అనసూయ చెవిన పడింది. అంతే మండిపోయింది. అనసూయకు చిర్రెత్తిపోయింది. అంతే 'దమ్ముంటే స్టేజ్‌పైకి రా అని సవాల్ విసిరింది. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చింది. ఏంటీ భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అన్నట్లుగా వెనక్కి చూపించి సైగ చేసింది. 'నిన్ను మాత్రం మరచిపోను' అంటూ సదరు ఆకతాయి కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 'అటు అనసూయ తగ్గదు, ఇటు జనాలు మారరు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ నటిగా క్షణం, రంగస్థలం, మీకు మాత్రమే చెప్తా, పుష్ప, విమానం, రజాకార్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో కొల్లగొట్టినాదిరో పాటతొ సందడి చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ పాట ప్రేక్షకుల్ని అలరించింది.