Ambati Rayudu Comments: చిరంజీవి, సుకుమార్‌కి పబ్లిసిటీ అవసరమా.. రాయుడు..
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:13 PM
ఇండియా పాకిస్థ్థాన్ మ్యాచ్ హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. కామెంటరీ బాక్సులో కూర్చున్న అంబటి రాయుడు (Ambati Rayudu) మాత్రం ‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్’ (Publicity stunt) అని నోరు జారాడు. ఇప్పుడు అతని కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో (ICC champions trophy) భాగంగా ఆదివారం ఇండియా పాకిస్థ్థాన్ మ్యాచ్ హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం (India Vs pak) సాధించింది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి టాలీవుడ్ నుంచి కొందరు సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లారు. వారిలో ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi) సుకుమార్ (Sukumar) కుటుంబ సభ్యులు, తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్, ఊర్వశీ రౌతెల కనిపించి తెలుగు అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. కెమెరాలు కూడా వాళ్లని బాగా ఫోకస్ చేశాయి. అయితే.. కామెంటరీ బాక్సులో కూర్చున్న అంబటి రాయుడు (Ambati Rayudu) మాత్రం ‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్’ (Publicity stunt) అని నోరు జారాడు. ఇప్పుడు అతని కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అనగానే తెలుగువాళ్లు చాలామంది హాజరవుతారు. ఈ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్ అలాంటిది’ అని తోటి కామెంటేటర్ అనగా ‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు వేస్త టీవీలో ఎక్కువసార్లు చూపిస్తారు కదా’ అంటూ రాయుడు జోక్ చేశాడు.
అయితే అతను ఏ ఉద్దేశంతో అన్నాడో ఆయనకే తెలియాలి. చిరంజీవి, సుకుమార్‌లకు పబ్లిసిటీ స్టంట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆ మాట అన్న రాయుడికే తెలియాలి. ఇప్పుడు సుకుమార్ దేశం గర్వించదగి దర్శకుడు. ఆయన కోరుకొంటే ప్రతీ రోజూ టీవీల్లో కనిపించే అవకాశం ఉంది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఖర్చు పెట్టుకుని దుబాయ్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి చూడని పబ్లిసిటీ ఉందా? కెమెరా తనవైపు తిరగాలంటే ఆయన దుబాయ్ వరకూ వెళ్లాలా? ఈ విషయం రాయుడికి తెలియాదా? మామూలుగానే రాయుడికి అసహనం ఎక్కువ. మైదానంలో దాన్ని వీలైనంత వరకూ బయటపెట్టేస్తుంటాడు. ఇప్పుడు కామెంటరీ బాక్సులో కూర్చుని కూడా అదే చేస్తున్నాడా? అని క్రికెట్ ప్రియులు అతనిపై కామెంట్ చేస్తున్నాడు. తెలుగువాడు అయ్యుండి, సాటి తెలుగువాళ్లపై ఇలా చీప్ కామెంట్స్ చేయడం కరెక్ట్‌గా లేదని నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. నెటిజన్లు అంటున్న ఇంకో మాటేంటంటే.. రాయుడు ఇప్పుడు పబ్లిసిటీ కోరుకొంటున్నాడేమో? ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాపులర్ అవ్వాలనుకుంటున్నాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు.