Aakash chopra: శంభాజీ మహారాజ్‌ గురించి పాఠశాలల్లో ఎందుకు నేర్పించలేదు

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:12 PM

శంభాజీ మహారాజ్‌ జీవిత కథను ‘ఛావా’ (Chhaava) సినిమాతో హృదయాలను హత్తుకునేలా చూపించారు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ (Lakshman Utekar) మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో విక్కీ కౌశల్‌ జీవించేశారు.

శంభాజీ మహారాజ్‌ జీవిత కథను ‘ఛావా’ (Chhaava) సినిమాతో హృదయాలను హత్తుకునేలా చూపించారు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ (Lakshman Utekar) మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో విక్కీ కౌశల్‌ జీవించేశారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా దీనిపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా (Akash Chopra) పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘ఈరోజే ‘ఛావా’ (Chhaava) సినిమా చూశాను. ధైౖర్యం, నిస్వార్థం, తన పనిపై అంకితభావం, ఇలా ఎన్నో విషయాలు కలిసిన గొప్ప కథ ఇది. నిజయతీగా ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నామనకు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ గురించి పాఠశాలల్లో ఎందుకు నేర్పించలేదు? ఆయన గురించి పుస్తకాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు! కానీ అక్బర్‌ గొప్ప నాయకుడని.. న్యాయంగా పాలించిన చక్రవర్తి అని నేర్పించారు. ఢిల్లీలో ఓ పెద్ద రహదారికి ఔరంగజేబు రోడ్డు అని పేరు కూడా పెట్టారు. అలా ఎందుకు చేశారు?’’ అని తన పోస్ట్‌లో ప్రశ్నించారు.

Shambaji.jpg

ఆకాశ్‌ చోప్రా పోస్ట్‌పై నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్‌ చేస్తున్నారు. ఓ నెటిజన్‌ మీరు చరిత్ర నేర్చుకోలేదా అని అడగ్గా ఆకాశ్‌ చోప్రా అతడికి సమాధానమిచ్చారు. ‘నేను టాపర్‌ని. చరిత్రలో నాకు 80 శాతం మార్కులు వచ్చాయి’ అని రిప్లై పెట్టారు. కొందరు ఈ మాజీ క్రికెటర్‌ ప్రశ్నలకు సపోర్ట్‌గా ఉండగా, మరికొందరు దీన్ని వివాదాస్పదంగా మార్చవద్దని అంటున్నారు. దేశవ్యాప్తంగా ‘ఛావా’ అద్భుతంగా ఆడుతోంది. తొలిరోజే రూ.31 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.121 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌ చరిత్రలో ఏ హిస్టారికల్‌ సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్‌ రాలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. విడుదలైన తర్వాత మరికొన్ని థియేటర్లు పెంచారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,670 షోలు ప్రదర్శిస్తున్నారు. ఇందులో విక్కీ కౌశల్‌ శంభాజీ మహారాజ్‌గా కనిపించగా, ఆయన భార్య యేసుబాయిగా రష్మిక నటించారు.

Updated Date - Feb 18 , 2025 | 04:15 PM