RC16: రామ్ చరణ్ ‘ఆర్‌సి16’ సెట్స్‌లో స్పెషల్ గెస్ట్.. ఎవరో తెలుసా?

ABN , Publish Date - Feb 05 , 2025 | 10:31 PM

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా సినిమా‌గా ‘RC16’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్‌లోకి బుధవారం ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారని చెబుతూ.. రామ్ చరణ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరంటే..

RC16 Sets

రామ్ చరణ్ ‘ఆర్‌సి16’ సెట్స్‌కు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఈ విషయం స్వయంగా రామ్ చరణ్ తన ఇన్‌స్టా వేదికగా తెలియజేశారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కూడా తెలుపుతూ ఓ ఫొటోని షేర్ చేశారు. ఆ ఫొటో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా సినిమా‌గా ‘RC16’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘గేమ్ చేంజర్’తో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కి ఎలాగైనా ట్రీట్ ఇవ్వాలని ఎంతో కసిగా ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ వర్క్ చేస్తున్నారు. ‘గేమ్ చేంజర్’ థియేటర్లలో ఉండగానే.. ఈ సినిమా షూటింగ్‌కు చరణ్ రెడీ అయ్యారు.


Also Read- Tollywood Producer: పవన్ కళ్యాణ్, మహేష్‌లతో చేసిన చిత్రాలతో రూ. 100 కోట్లు నష్టపోయా..

‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. RC16గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. RC16లో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ డాల్ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. కరుణ‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్ కుమార్, విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండగా.. బుధవారం ఈ సెట్స్‌లోకి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు.


Ram-Charan.jpg

Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..

ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు.. మెగా ప్రిన్సెస్ క్లీంకార. రామ్ చరణ్ తన బిడ్డ క్లీంకారను ఎత్తుకుని ఉన్న ఫొటోని షేర్ చేసి.. ‘RC16 సెట్స్‌లోకి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు’ అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ షేర్ చేసిన ఫొటోలో కూడా క్లీంకార ఫేస్‌ని రివీల్ చేయలేదు. అతి త్వరలోనే క్లీంకార ఫేస్‌ను మెగా ఫ్యామిలీ రివీల్ చేయనుంది.


Also Read- Madhavan: కొంపముంచిన ఏఐ.. మాధవన్‌కు అనుష్క కాల్

Also Read- Sairam Shankar: ‘పట్టుకుంటే 10 వేలు’ పథకం పెట్టడానికి కారణం ఏంటంటే..

Also Read- Balakrishna Favourite Heroines: బాలయ్య ఫేవరెట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 10:31 PM