Khel Khatam Darwajaa Bandh: ఏదో... ఏదో... అంటున్న రాహుల్ విజయ్
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:19 PM
రాహుల్ విజయ్ హీరోగా నటించిన 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్' సినిమా నుండి 'ఏదో... ఏదో' అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. నేహా పాండే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
రాహుల్ విజయ్ (Rahul Vijay), నేహా పాండే (Neha Pandey) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నసినిమా 'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్' (Khel Khatam Darwajaa Bandh). అశోక్ రెడ్డి కడదూరి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ నుంచి 'ఏదో ఏదో..' లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఏదో ఏదో..' అంటూ సాగే ఈ గీతాన్ని పూర్ణాచారి రాయగా, సురేశ్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు. దీనిని కార్తీక్, హరిణి పాడారు. 'ఏదో ఏదో ఏదో జరిగెనే యెద లోపలా, ఏవో ఏవో కలలు విరిసెనే, నిన్నా మొన్నా లేదే అరే ఏంటిలా, ఉన్నట్టుండి ముంచేశావిలా, మనసే ముసుగులు తీసే, అడుగులు వేసే బయటకు నీతోనే, కలిసే నిమిషం వణికే, పెదవులు పలికే తకధిమి తందానే...' అంటూ సాగిన ఈ పాట వినడానికి హాయిగా ఉంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.