MAD Square Teaser: పొట్టచెక్కలు అయ్యేలా నవ్వించడానికి  

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:18 PM

'మ్యాడ్'కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్'ను ప్రకటించినప్పటి నుండి, సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం ఈ సినిమా  టీజర్   విడుదలైంది.  ఓ వేడుకకు సంబంధించి.. దర్శకులు వెంకీ అట్లూరి(1116), అనుదీప్‌ కేవీ(516), నిర్మాత నాగవంశీ(116) పేర్లతో కూడిన చదివింపులతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. నిమిషాల్లోనే ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వేసవికి 'మ్యాడ్ స్క్వేర్', ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్ తో స్పష్టమైంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుంది. 

Updated Date - Feb 25 , 2025 | 05:26 PM