Allari Naresh: ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్న

ABN , Publish Date - Mar 17 , 2025 | 05:13 PM

నరేశ్‌ హీరోగా నాని కాసరగడ్డ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే.ఈ  చిత్రానికి  ‘12ఎ రైల్వే కాలనీ’ అనే పేరు ఖరారు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈమేరకు టైటిల్‌ టీజర్‌ రివీల్‌ చేసింది. ‘‘ఈ ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి. అందరికీ ఎందుకు కనిపించవు’’ అనే డైలాగ్స్‌తో మొదలైన ఈ టీజర్‌ ఉత్కంఠగా సాగింది. ‘‘ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్న...!’’ అంటూ టీజర్‌ చివర్లో నరేశ్‌ చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.