Nari Nari Naduma Murari: దర్శనమే మధుర క్షణమే అంటున్న శర్వానంద్...
ABN , Publish Date - Apr 09 , 2025 | 06:39 PM
శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం 'నారి నారి నడుమ మురారి' నుండి తొలి గీతం విడుదలైంది. 'సామజవర గమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
శర్వానంద్ (Sharwanad) , సంయుక్త (Samyuktha) జంటగా నటిస్తున్న సినిమా 'నారి నారి నడుమ మురారి' (Nari Nari Naduma Murari). సాక్షి వైద్య (Sakshi Vaidya) ఇందులో మరో నాయికగా నటిస్తోంది. 'సామజవర గమన' ఫేమ్ రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'అల్లరి' నరేశ్ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో తొలి గీతం 'దర్శనమే మధుర క్షణమే' బుధవారం విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను యాసిన్ నిజార్ పాడగా, భాను కొరియోగ్రఫీ చేశారు. ఈ మెలోడీ సాంగ్ లో శర్వా, సంయుక్త మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. భాను భోగవరపు ఈ సినిమాకు కథను అందించగా, నందు సావిరిగాన సంభాషణలు సమకూర్చారు. ఈ మూవీని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.