Santhana Prapthirasthu: కనులే చెబితే, మనసే వినదా అంటున్న చాందినీ చౌదరి

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:17 PM

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన 'సంతాన ప్రాప్తిరస్తు' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana Prapthirasthu). ఈ మూవీని మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే అందించారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతోంది. తాజాగా ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ను మేకర్స్ ప్రారంభించారు. అందులో భాగంగా బుధవారం 'నాలో ఏదో...' అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు శ్రీజో సాహిత్యం సమకూర్చారు. దీనిని దినకర్ కల్వల, అదితి భావరాజు పాడారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదల చేసిన 'సంతాన ప్రాప్తిరస్తు' మూవీ టీజర్ కు మంచి స్పందన లభించిందని, ఈ పాటకు కూడా శ్రోతలను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు.

Also Read: Vijay Devarakonda: రౌడీ హీరో తగ్గాడా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 26 , 2025 | 03:17 PM