Narne Nithiin: మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ వచ్చేసింది...
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:40 PM
మొత్తానికి 'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్ ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. మంగళవారం రావాల్సిన ఈ ట్రైలర్ కాస్తంత ఆలస్యంగా బుధవారం జనం ముందుకు వచ్చింది.
సంగీత్ శోభన్ (Sangeeth Sobhan) , నార్నే నితిన్ (Narne Nithin), రామ్ నితిన్ (Ram Nithin) హీరోలుగా నటించిన 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) మూవీ ట్రైలర్ కాస్తంత దోబూచులాట తర్వాత ఎట్టకేలకు బుధవారం విడుదలైంది. సినీ అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. టీజర్ తో పోల్చితే... ఆ స్థాయిలో పంచ్ డైలాగ్స్ లేకపోయినా... ఈ ట్రైలర్ నూ ఫన్ జనరేట్ అయ్యేలా మేకర్స్ రూపొందించారు. ముందు నుండి నిర్మాత నాగవంశీ చెబుతున్నట్టుగానే ఈ సినిమాలో కథేమీ పెద్దగా ఉన్నట్టు అనిపించడం లేదు. అయితే ఏదో ఓ అంశాన్ని మాత్రం హైడ్ చేసినట్టు ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. మ్యాడ్ స్క్వేర్ మూవీకి భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందిస్తే... తమన్ నేపథ్య సంగీతం సమకూర్చాడు. విడుదలైన కొద్ది సమయంలోనే 'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ చిత్రం మార్చి 28న జనం ముందుకు వస్తోంది.
Also Read: Tollywood: తెలుగు చిత్రసీమలో తారాజువ్వ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి