Hit -3: నాని మూవీ నుండి రొమాంటిక్, మెలోడీ సాంగ్

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:13 PM

నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన సినిమా 'హిట్ -3'. మే 1న రాబోతున్న ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది.

నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా 'కోర్టు' (Court) సినిమాతో ఇటీవలే ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. చిన్న చిత్రంగా విడుదలైన 'కోర్ట్' రూ. 50 కోట్ల గ్రాస్ దిశగా సాగుతోంది. ఇదిలాఉంటే... మే 1న రాబోతున్న నాని చిత్రం 'హిట్ -3' (Hit -3) పాటల ప్రచార పర్వం మొదలైంది. ఇందులోని 'ప్రేమ వెల్లువ' గీతాన్ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు. నాని, శ్రీనిధి శెట్టి (Srinidhi Setty) పై ఈ పాటను చిత్రీకరించారు. సాగర తీరాన చిత్రీకరించిన ఈ స్వీట్ రొమాంటిక్ మెలోడీ గీతాన్ని సిద్ శ్రీరామ్, నూతన మోహన ఆలపించారు. మిక్కీ జే మేయర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా, కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. 'హిట్ -3' మూవీ అర్జున్ సర్కార్ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రను నాని పోషిస్తున్నాడు. ఇప్పటికే 'హిట్' ఫ్రాంచైజ్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ను అందుకున్న డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న మూడో సినిమా ఇది. నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

Also Read: Varun Tej 15: ఇండో కొరియన్‌ హారర్‌ కామెడీ కాన్సెప్ట్‌తో...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 24 , 2025 | 12:13 PM