Premalu: ఆకట్టుకునేలా జింఖానా మూవీ ట్రైలర్

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:09 PM

'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ నటించిన తాజా చిత్రం 'జింఖానా' పేరుతో తెలుగులో రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు.

తెలుగువారి ముందుకు 'ప్రేమలు' (Premalu) చిత్రంతో వచ్చాడు నస్లెన్ (Naslen). అతని తాజా చిత్రం 'అలప్పుళ జింఖానా' మలయాళంలో చక్కని విజయాన్ని అందుకుంది. 'ప్రేమలు'కు తెలుగు లో లభించిన ఆదరణను దృష్టి పెట్టుకుని నస్లెన్ లేటెస్ట్ మూవీని 'జింఖానా' (Gymkhana) పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్ ఇతర కీలక పాత్రలను పోషించారు. ఖలీద్ రహ్మాన్ (Khalid Rahman) దర్శకత్వంలో దీనిని ప్లాన్ బి మోషన్ పిక్చర్స్, రీలిస్టిక్ స్టూడియోస్ బ్యానర్స్ నిర్మించారు.


ఏప్రిల్ 25న తెలుగులో విడుదల కాబోతున్న 'జింఖానా' మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) శనివారం విడుదల చేశారు. బాక్సింగ్ నేర్చుకునేందుక సిద్ధపడ్డ కొద్ది మంది కుర్రాళ్ళ కథ ఇది. బాక్సింగ్ ను సరదాగా నేర్చుకోవాలనుకున్న వీరి జీవితాలను ఆ క్రీడ ఎలా మార్చేసిందన్నదే కథ. బాక్సింగ్ అంటే కేవలం పంచ్ లు ఇవ్వడం కాదు... క్రమశిక్షణ కూడా అనేది వారు తెలుసుకుంటారు. సరదాగా మొదలెట్టిన బాక్సింగ్ క్లాసెస్ వారి జీవితాలను ఊహించని మలుపులు తిరుగుతుంది. అవేమిటనేది తెర మీద చూడాల్సిందే అంటున్నారు ద్శకుడు ఖలీద్ రహ్మాన్. విష్ణు విజయ్ సంగీతాన్ని అందించగా, జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్ గా ఉండబోతోందని ఖలీద్ తెలిపారు.

Also Read: Sonakshi Sinha: మే నెలాఖరులో నికితా రాయ్....

Also Read: Akhanda -2: హక్కుల కోసం ఓటీటీల ఆరాటం

Also Read: Sankranthi Movies: వంద రోజులు ఎక్కడంటే...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 19 , 2025 | 05:09 PM