Allu Arjun: రెండు ఆటలు బన్నీవే.. అట్లీ ప్లాన్‌ మామూలుగా లేదు..

ABN , Publish Date - Mar 23 , 2025 | 05:38 PM

అల్లు అర్జున్ అట్లీ సినిమా గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది

అల్లు అర్జున్‌ (Allu Arjun), అట్లీ (Atlee) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ కథా చర్చలు జరుపుతున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. త్వరలోనే బన్నీ ఇండియాకు తిరిగి వస్తారు. వచ్చాక అఫీషియల్‌గా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కానుందని తెలిసింది.  అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీది డ్యూయల్‌ రోల్‌ Bunny Duel role) అని తెలుస్తోంది.

ఓ పాత్రలో పూర్తిగా నెగిటీవ్‌ షేడ్స్‌ ఉంటాయట. దాదాపుగా విలన్‌కు సమానమైన పాత్ర అని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో, విలన్‌ రెండూ బన్నీనే అట. ఈ తరహా పాత్ర చేయడం స్టార్‌లకు ఓ రకంగా ఛాలెంజ్‌ అనే చెప్పాలి. పుష్పలో కూడా బన్నీ పాత్రలో కొంత నెగిటీవ్‌ షేడ్‌ ఉంటుంది. అయితే ఆ పాత్రకు బన్నీ పెద్దగా కష్టించాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. తదుపరి త్రివిక్రమ్‌తో బన్నీ ఓ సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ ఆ కథపై కసరతులు చేస్తున్నారు. బన్నీ దుబాయ్‌ నుంచి  తిరిగొ వచ్చాక.. బన్నీ తదుపరి చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

Updated Date - Mar 23 , 2025 | 05:39 PM