SSMB 29: మహేష్‌తో ఈ కథే ఎందుకు చేస్తున్నాం అంటే..

ABN , Publish Date - Feb 06 , 2025 | 08:42 AM

అసలు రాజమౌళి అడ్వెంచర్ థ్రిల్లర్‌‌ను ఎందుకు తెరకెక్కిస్తున్నాడు. మహేష్‌తోనే ఎందుకు? ఈ ప్రశ్నలకు రచయిత, రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సమాధానాలు చెప్పారు.

Why Mahesh Babu Cast in SSMB 29? Reveals Vijayendra Prasad

మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'SSMB 29'. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో దుర్గ బ్యానర్స్‌లో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మీడియాతో ముచ్చటించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. అసలు మహేష్ బాబుతో ఈ కథనే ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాడు.


విజయేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. " భారతీయ సినిమాలో అడ్వెంచర్ థ్రిల్లర్‌ జానర్‌లో భారీ బడ్జెట్ సినిమాలు రాలేదు. సరిగ్గా ఎక్స్‌ప్లోర్ కూడా చేయలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ భారత్ వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని తెరకెక్కిస్తునాం. అలాగే మహేష్ ఇప్పటివరకు ఈ జానర్ ని టచ్ చేయలేదు. కాబట్టి ఈ కథకు మహేష్ సూట్ అవుతాడు" అని అన్నారు.


హీరోయిన్ కాదు విలన్

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం కెన్యాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇతర కాస్టింగ్ తో షూట్ నిర్వహిస్తున్నారు. అయితే అందరు భావిస్తున్నట్లు ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ కాదట, ఆమె విలన్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. మహేష్ సరసన హీరోయిన్ కోసం మరో ఇంటర్నేషనల్ బ్యూటీని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా రాజమౌళి 'SSMB 29' కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులతో చిత్రబృందం నాన్‌-డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్‌ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు కాకుండా చిత్ర బృందం భారీగా ప్లాన్ చేసింది.

Updated Date - Feb 06 , 2025 | 08:46 AM