Nag Ashwin: జపాన్‌లో హాట్ కేకుల్లా మహాభారతం పుస్తకాలు.. కల్కి ఎఫెక్ట్

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:56 PM

Nag Ashwin: ప్రస్తుతం జపాన్‌లో భారతీయ మహా ఇతిహాస పురాణం 'మహాభారతం' పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సడెన్‌గా ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుందంటే..

ప్రస్తుతం జపాన్‌లో భారతీయ మహా ఇతిహాస పురాణం 'మహాభారతం' పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇటీవల జపనీస్ భాషలో వీపరీతంగా మహాభారతం పుస్తకాలు అనువాదించబడ్డాయి. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సేల్స్‌లో టాప్‌గా నిలుస్తున్నాయి. సడెన్‌గా ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుందంటే..


నాగ్ అశ్విన్.. అవును ఈ పేరు ప్రధాన కారణం. గతేడాది నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి' సినిమా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా జపాన్ లో విడుదలైంది. సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చిన.. మెజారిటీ జనాలు సినిమా చూసేశారు. ఈ సినిమా చూసిన తర్వాత అక్కడ చాలామందికి మహాభారతం చదవాలనే కూతుహలం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ షేర్ చేసిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన ఏం పోస్టు చేశారంటే..


నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్టు చేస్తూ.. " ఓ పోస్టు చదివాను, జపాన్ లో ట్రాన్స్లేట్ చేయబడిన మహాభారతం పుస్తకాలన్నీ అమ్ముడుపోయాయని. చాలా సంతోషంగా ఉంది" అంటూ రాసుకొచ్చారు. అయితే కల్కి సినిమాలో ప్రభాస్ ని కర్ణుడి పాత్రలో గొప్పగా చూపించడంపై హిందుత్వ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Untitled-2 copy.jpg

Updated Date - Jan 06 , 2025 | 04:04 PM