Chiranjeevi: చిరు సరసన ఈ సారి ఎవరో..
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:47 PM
చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కలయికలో ఓ సినిమా కుదిరింది. ఇటీవల అనిల్ రావిపూడి చిరంజీవికి ఫైనల్ కథ చెప్పారు. దానికి చిరంజీవి పచ్చజెండా ఊపారు.
చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కలయికలో ఓ సినిమా కుదిరింది. ఇటీవల అనిల్ రావిపూడి చిరంజీవికి ఫైనల్ కథ చెప్పారు. దానికి చిరంజీవి పచ్చజెండా ఊపారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మరింతగా జోరందుకున్నాయి. అనిల్ రావిపూడి తనకి అలవాటైన టెక్నీషియన్స్‌తోనే ఈ ప్రాజెక్టు చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటిదాకా హీరోయిన్ డిసైడ్ అవ్వలేదు. అయితే ఇప్పటికే పలు పేరు వినిపించాయి. పరిణితి చోప్రా, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అనిల్ రావిపూడి ఈ కథని భార్యాభర్తలు మధ్య ఎమోషన్ ఉన్న కథగానే రాసుకున్నాడని సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’లా ఇది కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిసింది. భార్యభర్తల కెమిస్ర్టీ ఈ సినిమాలో కీలకమని చిత్ర వర్గాల నుంచి సమాచారం. చిరంజీవి క్యారెక్టర్‌ని ఫ్యామిలీ మ్యాన్‌లా తీర్చిదిద్దారట అనిల్. ఉగాదికి ఈ సినిమాని లాంఛనంగా మొదలు పెడతారు. హీరోయిన్ మిగతా నటీనటులు ఫిక్స్ అయిన తర్వాత ఒక లాంచింగ్ ఉంటుందని సమాచారం.
అయితే తదుపరి చిరు చేయబోతున్న ఓ చిత్రంలో రా ఏజెంట్ గా కనిపిస్తారని ఫిలింనగర్‌లో వినిపిస్తుంది. ఆ సినిమా అనిల్ రావిపూడిదేనా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని సిద్థం చేసేలా ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.