Chiranjeevi: చిరంజీవితో మరోసారి..
ABN , Publish Date - Feb 02 , 2025 | 10:08 AM
చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ కి సంబందించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట హలచల్ చేస్తోంది. హిట్టు దర్శకుడితో అయన మరో సినిమా చేయబోతున్నారని టాక్ నడుస్తోంది
చిరంజీవి (Chiranjeevi) యువ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'విశ్వంభర' (Vishwambhara) చిత్రంతో బిజీగా ఉన్నారు. తదుపరి శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా కమిట్ అయ్యారు. అలాగే అనిల్ రావిపూడితోనూ ఓ సినిమా ప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు కార్యరూపం దాల్చకముందే చిరు మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ‘వాల్తేరు వీరయ్య’తో (Waltair veerayya)భారీ విజయాన్ని అందించిన దర్శకుడు బాబీ (Bobby Kolli) కొల్లితో చిరంజీవి మరోసారి చేతులు కలపనున్నారని సమాచారం. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశముంది. ఇప్పుడీ చిత్రం కోసం బాబీ కథ విషయమై కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. అనిల్ సినిమా పూర్తయ్యేలోగా స్క్రిప్ట్ సిద్థమయ్యే అవకాశముంది. తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నా బాబీ బాలీవుడ్‌పై కూడా కన్నేశారని తెలుస్తోంది.
దర్శకుడు బాబీ చిరంజీవికి వీరాభిమాని. ఆయనతో సినిమా చేయాలనే కల వాల్తేరు వీరయ్యతో నెరవేర్చుకున్నారు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే ఎనర్జీతో చిరుతో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.