Vishwak Sen: సినిమా ఏదైనా సరే.. ఇకపై అసభ్యత ఉండదు.

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:31 PM

ఇటీవల విశ్వక్‌సేన్‌ నటించగా  విడుదలైన  సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదని, ఇక నుంచి ప్రేక్షకులు మెచ్చేలా చేస్తానని ఓ లేఖ విడుదల చేశారు.

ఇటీవల విశ్వక్‌సేన్‌ (Vishwak Sen apology) నటించగా  విడుదలైన  సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదని, ఇక నుంచి ప్రేక్షకులు మెచ్చేలా చేస్తానని ఓ లేఖ విడుదల చేశారు. రామ్‌ నారాయణ్ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం  ‘లైలా’ (Laila).  గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చి  బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. అంతకు ముందు ‘మెకానిక్‌ రాకీ’ పర్వాలేదనిపించినా, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of godavari) ఘోర పరాజయాన్ని అందుకుంది. దీంతో తనని ఆదరిస్తున్న ప్రేక్షకులను ఉద్దేశిస్తూ విశ్వక్‌ (Vishwak Sen) ఒక ప్రకటన విడుదల చేశాడు.

‘అందరికీ నమస్కారం.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నా. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన నా అభిమానులకు, నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ, ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నా. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్, మాస్ ఏదైనా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే (ప్రేక్షకులు)’’‘‘నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్టిబ్యూటర్స్‌ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే, నా కథానాయకులు దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తా. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం’’ అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం విశ్వక్‌సేన్, ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌.కె.వితోతో  ‘ఫంకీ’ (Funky) సినిమాలో నటిస్తున్నారు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి రూపొందిస్తున్నాయి.

ALSO READ: NTR 31: తారక్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. నీల్‌ మొదలెట్టాడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Feb 20 , 2025 | 04:35 PM