Vishwak Sen: లైలా కోసం 'విశ్వక్' పాట్లు..
ABN , Publish Date - Jan 24 , 2025 | 08:01 AM
Vishwak Sen: మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్' మొదటిసారి ఫిమేల్ రోల్ నటిస్తున్న సినిమా 'లైలా' కోసం అనేక పాట్లు పడాల్సి వచ్చింది. దీనిపై విశ్వక్ మాట్లాడుతూ.. ఏమన్నాడంటే..
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ హీరోహీరోయిన్లుగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ గా నిలిచినా విశ్వక్..ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ లేడి గెటప్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా పోస్టర్లు, టీజర్ అట్రాక్టింగ్ గా ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం విశ్వక్ చాలానే పాట్లు పడాల్సి వచ్చిందంటా.. ఏం జరిగిందంటే
మాస్ కా దాస్ 'విశ్వక్' ఈ సినిమాలో ఫంకీ బాయ్ గానే కాకుండా ఒక ఫిమేల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టీజర్ లో ‘సైలెన్సర్’ అంటూ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కనిపించాయి. కాగా, అది ఈ సినిమా ఫస్ట్ డే షూట్ లోనే చేయాల్సి వచ్చిందంటే. దీనికోసం విశ్వక్ ఎన్ని పాట్లు పడ్డాడు అంటే.. ఆయన మాటల్లోనే వినండి.. " మేకప్ కోసం ప్రతిరోజూ రెండున్నర గంటల సమయం కేటాయించాల్సి వచ్చేది. పైగా బయట ఎవరైనా చూస్తారేమో అనే భయంతో, షూటింగ్ అయిన తర్వాత నేరుగా ఇంటికెళ్లిపోయేవాడిని. ఎవరైనా అడిగితే విశ్వక్ ఇంట్లో లేడని చెప్పించేవాడిని. ఇలా లైలా పాత్ర కోసం చాలా కష్టపడ్డా" అంటూ చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా రెండు సాంగ్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది.లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.