Manchu Vishnu: నటుడిగా కొత్త లైఫ్ మొదలైంది..
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:00 PM
‘కన్నప్ప’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మంచు విష్ణు. ఈ చిత్రం తనకు రీ ఎంట్రీలా ఉందని అంటున్నారాయన. ‘బుక్ మై షో’ ఆధ్వర్వంలో జరిగిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడారు.
‘కన్నప్ప’ (Kannappa) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మంచు విష్ణు(manchu Vishnu). ఈ చిత్రం తనకు రీ ఎంట్రీలా ఉందని అంటున్నారాయన. ‘బుక్ మై షో’ ఆధ్వర్వంలో జరిగిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడారు. ‘‘ఈ సినిమా కోసం స్టోరీబోర్డ్ ఆర్టిస్టులను లాస్‌ఏంజెల్స్ నుంచి తీసుకొచ్చా. కన్నప్ప గురించి చేసిన రీసెర్చ్ తర్వాత చాలా డ్రాయింగ్స్ వేశాం. అలా 2015లోనే ఈ మూవీ ప్రయాణం మొదలైంది. ‘నేను తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించగలను. కానీ, నువ్వు అనుకున్న స్థాయిలో తీయలేను. కథ ఇస్త్తా తీసుకో’ అని తనికెళ్ల భరణి అన్నారు. ఆయన ఐడియాతో నేను స్క్రిప్ట్ డెవలప్ చేశాం. ఈ సినిమా ప్రారంభానికి ముందు నేను శివ భక్తుడిని కాదు. హనుమాన్ భక్తుడిని. ఎందుకో తెలియదు గానీ ‘కన్నప్ప’ ప్రయాణంలో శివ భక్తుడిగా మారా. జ్యోతిర్లింగాల దర్శనం నుంచి నా జీవితంలో పాజిటివిటీ చూస్తున్నా. వృత్తిపరంగా ఒత్తిడి ఉన్నా పాజిటివిటీ ముందు అది కనిపించట్లేదు. ‘కన్నప్ప’.. నటుడిగా నా నట జీవితం పునఃప్రారంభం అనుకుంటున్నా’’ అని అన్నారు మంచు విష్ణు.
ఇంకా ఆయన చెబుతూ ‘కన్నప్ప’లో పోషించిన రుద్ర పాత్రలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయన నటనకు ఫిదా అవుతారు. నాన్నపై ఉన్న ప్రేమ, గౌరవం వల్లే ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. వారి స్ర్కీన్ ప్రెజెన్స్ విషయంలో టెన్షన్ పడలేదు. వారి పోస్టర్ల డిజైనింగ్‌లోనే టెన్షన్ పడ్డాను(నవ్వుతూ. ఇందులో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది.