Naga Chaitanya: నాగ చైతన్య నెక్ట్స్ సినిమా.. విలన్ ఫిక్స్
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:40 PM
నాగ చైతన్య తదుపరి చిత్రానికి విలన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి చైతూ కోసం బాలీవుడ్ విలన్ ని రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నాగచైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ సినిమా (Thandel) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఆ తరవాత కార్తీక్ దండు సినిమా మొదలు కానుంది. ‘విరూపాక్ష’తో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నారు కార్తీక్(Karthik varma Dandu) ఇప్పుడు నాగచైతన్య కోసం ఓ థ్రిల్లర్ కథ సిద్థం చేసుకొన్నారు. ఆర్టిస్ట్‌లు, టెక్నికల్ టీమ్ సెలక్షన్‌లో చిత్రం బృందం బిజీగా ఉంది. కథానాయికగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే, శ్రీ లీల(Shree leela) , మీనాక్షి (Meenakshi Chowdary) చౌదరి ఇలా చాలా పేర్లే వినిపిస్తున్నాయి. మీనాక్షి లేదంటే.. శ్రీలీల ఖరారు కావొచ్చని తెలుస్తోంది. అలాగే టైటిల్ విషయంలోనూ చర్చ జరుగుతోంది. ‘వృష కర్మ’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాజాగా విలన్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి చైతూ కోసం బాలీవుడ్ విలన్ ని రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్పర్ష్ శ్రీవాత్సవ (Sparsh Srivatsava) ఇప్పుడు చైతూతో ఢీకొట్టతున్నాడు. ‘బాలికా వధూ’’ సీరియల్‌తో బాలీవుడ్ దృష్టిని ఆకట్టుకొన్నాడు శ్రీవాత్సవ. ఆ తరవాత ‘లా పతా లేడీస్’తో ప్రేక్షకులకి’ మరింత దగ్గరయ్యాడు. తనకు దక్షిణాదిన ఇదే తొలి సినిమా. త్వరలోనే లుక్ టెస్ట్ కూడా జరగబోతోంది. విలన్ పాత్ర రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. త్వరలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి.