Chiranjeevi: అనిల్ తో కలిసి చిరు పల్లెబాట
ABN , Publish Date - Mar 17 , 2025 | 07:12 PM
టాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ మారుతోంది. మొన్నటివరకు మోడర్న్, ట్రెండింగ్ సబ్జెక్టులకు జైకొట్టిన మూవీ లవర్స్ ఇప్పుడు రూట్ మార్చేస్తున్నారు. రంగు రంగుల సెట్టింగులు, హైటెక్ హంగులను చూసి మొహం మొత్తిపోవడంతో.. మట్టి కథలు, పల్లె అందాలకు, అనుబంధాలకు జైకొడుతున్నారు
టాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ మారుతోంది. మొన్నటివరకు మోడర్న్, ట్రెండింగ్ సబ్జెక్టులకు జైకొట్టిన మూవీ లవర్స్ ఇప్పుడు రూట్ మార్చేస్తున్నారు. రంగు రంగుల సెట్టింగులు, హైటెక్ హంగులను చూసి మొహం మొత్తిపోవడంతో.. మట్టి కథలు, పల్లె అందాలకు, అనుబంధాలకు జైకొడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే తెలుగు సినిమాలు కూడా పల్లెటూరి బాట పడుతున్నాయి. యంగ్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అఖిల్ లు తో సహా చాలా మంది హీరోలందరూ కూడా తమ అప్ కమింగ్ మూవీలకు రూరల్ బ్యాక్ డ్రాప్ నే ఉండేలా చూసుకుంటున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరు (Megastar Chiranjeevi) సైతం అదే ఫాలో అవుతుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి గతంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. “ఊరికి ఇచ్చిన మాట”, “పల్లెటూరి మొనగాడు”, “శివుడు శివుడు శివుడు”, “ఖైదీ”, “అల్లుడా మజాకా”, “ఆపద్బాంధవుడు”, “ఇంద్ర”, “సింహపురి సింహం” వంటి సినిమాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చాయి. ఆ మూవీస్ చిరంజీవి ఫ్యాన్స్ ను విశేషంగా అలరించాయి. ఈ సినిమాలు కేవలం ఎంటర్టైన్‌మెంట్‌నే కాదు పల్లెటూరి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని చక్కగా ఆవిష్కరించి ఆకట్టుకున్నాయి. తాజాగా చిరంజీవి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నారు. నాన్ స్టాప్ ఎంటర్టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడితో (Anil ravipudi) ఈ సినిమా ఉండబోతోందన్న న్యూస్ మరింత ఆసక్తిరేపుతోంది.
చిరంజీవితో అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్ జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీని కూడా సంక్రాంతి సీజన్‌కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏ మాత్రం కొదవ ఉండబోదని ఇప్పుడే మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా అదితి రావు హైదరీ బలంగా వినిపిస్తోంది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన కాంబో అయిన.. సంగీత దర్శకులు భీమ్స్, రమణ గోగుల ఈ సినిమాకు పనిచేయబోతున్నట్టుగా చెబుతున్నారు. రీసెంట్‌గా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకుని స్క్రిప్ట్‌ను పూజలు చేయించారు. మొత్తానికి యంగ్ హీరోలతో పాటు చిరంజీవి కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం క్రేజీగా మారింది.