Ghaati: అనుష్క ‘ఘాటి’లో హీరో ఎవరో తెలిసిపోయిందోచ్..
ABN , Publish Date - Jan 15 , 2025 | 07:29 PM
చాలా గ్యాప్ తర్వాత స్వీటీ అనుష్క ‘ఘాటి’గా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటుంది. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో హీరో ఎవరో తెలుపుతూ.. బుధవారం ఆ హీరో ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇంతకీ ‘ఘాటి’లో అనుష్క సరసన నటించే నటుడు ఎవరంటే..
అనుష్క ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆమె నుండి వచ్చిన ‘ఘాటి’ చిత్ర అనౌన్స్‌మెంట్, ఆ తర్వాత వచ్చిన గ్లింప్స్ అది నిజమే అనేది తెలియజేశాయి. ‘ఘాటి’ సినిమాలో ఆమె ఓ పవర్ ఫుల్ రోల్‌లో నటించినట్లుగా గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేసింది. క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’. ఇందులో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్‌లో కనిపించి అనుష్క అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో హీరో కూడా ఉన్నాడని.. తెలుపుతూ.. అతని ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
‘ఘాటి’ చిత్రంలో తమిళ స్టార్ విక్రమ్ ప్రభు దేశీ రాజు అనే లీడ్ క్యారెక్టర్‌ని పోషిస్తున్నట్లుగా తెలుపుతూ.. ఆయనకు పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ అతని ఫస్ట్ లుక్, పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అతన్ని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజెంట్ చేయగా, గ్లింప్స్ అతని రోల్‌ని మరింత పవర్ ఫుల్‌గా రివీల్ చేసింది. ఈ గ్లింప్స్‌ని దట్టమైన అడవులు, కఠినమైన ఘాట్ ప్రాంతాల గుండా పోలీసులు విక్రమ్‌ను వెంబడిస్తున్నట్లు రివీల్ చేశారు. అతను గూండాలతో ఇంటెన్స్ యాక్షన్ సీన్ ప్యాక్డ్‌గా ఉండగా.. చివరిలో విక్రమ్, అనుష్క తమ బైక్‌లను పక్కపక్కనే నడుపుతూ, ఒకరినొకరు చూసి నవ్వుతూ, వారి పాత్రల మధ్య పవర్ ఫుల్ కెమిస్ట్రీని సూచిస్తూ లైటర్ రొమాంటిక్ టచ్‌తో గ్లింప్స్ ముగించారు. ఈ గ్లింప్స్ హై-ఆక్టేన్ యాక్షన్‌ను ప్రామిస్ చేయడమే కాకుండా, ఒక అద్భుతమైన ప్రేమకథని కూడా చూపుతోంది. ఇంతకు ముందు వచ్చిన అనుష్క రోల్‌కి సంబంధించిన గ్లింప్స్, ఇప్పుడు వచ్చిన విక్రమ్ ప్రభు గ్లింప్స్ రెండూ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేలా ఉన్నాయి.
ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ ‘వేదం’ విజయం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కాగా, UV క్రియేషన్స్‌తో అనుష్కకు నాల్గవ చిత్రం. హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ‘ఘాటి’ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.