VD12: విజయ్ దేవరకొండ కోసం యానిమల్ హీరో..
ABN , Publish Date - Feb 11 , 2025 | 12:28 PM
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కోసం బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రంగంలోకి దిగుతున్నారు. గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘వీడీ 12’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కోసం బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రంగంలోకి దిగుతున్నారు. గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘వీడీ 12’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర బృందం ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 12న రిలీజ్ కానున్నట్లు తెలిపింది. (Ranbir Kapoor Voice for VD12)
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రానున్న విషయం తెలిసిందే. హిందీ వెర్షన్‌కు రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్టర్‌ను పంచుకుంది. ‘యానిమల్’ హీరో వాయిస్‌తో ఈ చిత్రం మరింత వైల్డ్‌గా మారనుందని.. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని పేర్కొంది. తమిళ టీజర్‌కు హీరో సూర్య వాయిస్ అందించనున్న విషయం తెలిసిందే!
ఈ సినిమాలో విజయ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. విజయ్ దేవరకొండను పవర్‌ఫుల్‌గా చూడనున్నారని ఇటీవల నిర్మాత ఓ ఇంటర్వ్యూలో అన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ (Sithara entertainments) నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.