Vijay Deverakonda: కుంభమేళాలో ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ

ABN , Publish Date - Feb 09 , 2025 | 07:00 PM

తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి గంగ నదిలో పుణ్య స్నానాలు ఆచరించాడు.

Vijay Deverakonda takes holy dip at Mahakumb

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతోగాను ఎదురు చూస్తున్నారు.`ఫ్యామిలీ స్టార్ సినిమా ప్లాప్ అయినా 'VD 12' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గౌతమ్ తిన్ననూరి వంటి ప్రామిసింగ్ డైరెక్టర్ తో విజయ్ కొలాబరేట్ కావడం అందరు పాజిటివ్ గానే ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ప్రచారంలో ఉన్న కంటెంట్ మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ ప్రయాగ్ రాజ్ లో కనిపించాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం కుంభమేళా కాదు.. మరొకటి ఉంది.


తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి గంగ నదిలో పుణ్య స్నానాలు ఆచరించాడు.

WhatsApp Image 2025-02-09 at 18.04.51 (1).jpegWhatsApp Image 2025-02-09 at 18.04.51.jpegఇప్పటికే సంయుక్త మీనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్, దిగంగన సూర్య వంశీ, రాజ్ కుమార్ రావు వంటి పలువురు సినీ తారలు కుంభమేళాకు అటెండ్ అయ్యి పుణ్య స్నానాలు ఆచరించారు. మరి విజయ్ స్పెషాలీటి ఏంటి అంటారా! ఉంది. అదే ఆయన లుక్.


ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ 'VD 12' కోసం ప్రత్యేకమైన లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. సంవత్సరం నుంచి ఎవరీకి కనిపించకుండా తన హెయిర్‌ని క్యాప్‌తో కవర్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్లిన, ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే క్యాప్ మాత్రం తీయలేదు. తాజాగా పాల్గొన్న కుంభమేళాలో విజయ్ మొదటి సారి క్యాప్ తీసి కనిపించాడు. విజయ్ బాల్డ్ లుక్ తో బయటి ప్రపంచానికి తొలిసారి కనిపించడంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే ఇదే లుక్ తో 'VD 12' పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే.

vijay-deverakondas-first-look-from-vd-12-out-021213947-3x4.jpg

Updated Date - Feb 09 , 2025 | 07:07 PM