Vijay Devarakonda: బన్నీకి సర్‌ఫ్రైజ్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

ABN , Publish Date - Apr 26 , 2025 | 10:49 AM

అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండల మధ్య మంచి బాండింగ్‌ ఉన్న సంగతి  తెలిసిందే! ఫ్యాన్స్‌లో ఇద్దరికీ మంచి క్రేజ్‌ కూడా ఉంది. సమయం కుదిరిన ప్రతిసారీ ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.

అల్లు అర్జున్‌(Allu Arjun), విజయ్‌ దేవరకొండల (Vijay Devarakonda) మధ్య మంచి బాండింగ్‌ ఉన్న సంగతి  తెలిసిందే! ఫ్యాన్స్‌లో ఇద్దరికీ మంచి క్రేజ్‌ కూడా ఉంది. సమయం కుదిరిన ప్రతిసారీ ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ గిఫ్ట్‌ ఇచ్చారు. తాజాగా విజయ్‌ దేవరకొండ రౌడీ బ్రాండ్‌ స్టోర్‌ను (Rowdy Brand Store) హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్‌ డ్రెస్‌లను, పిల్లల కోసం కొన్ని బర్గర్‌లను పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను పంచుకున్న బన్నీ ‘‘మై స్వీట్‌ బ్రదర్‌.. (My Sweet Brother) ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్‌ చేస్తుంటావు. సో స్వీట్‌’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశారు.


Vd.jpg

ఇంతకుముందు కూడా అల్ల్లు అర్జున్‌కు విజయ్‌ గిఫ్ట్‌లు పంపిన విషయం తెలిసిందే. ‘పుష్ప 2’ రిలీజ్‌ సందర్భంగా ‘పుష్ప’ పేరుతో ఉన్న టీ షర్ట్‌లను పంపారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘నా స్వీట్‌ బ్రదర్‌.. నీ ప్రేమకు కృతజ్ఞతలు’’ అని బన్నీ పేర్కొన్నారు. ‘‘లవ్‌ యూ అన్నా.. మన సంప్రదాయాలు  కొనసాగుతాయి’’ అని విజయ్‌ రిప్లై ఇచ్చారు.

ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీని తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా ఉంది. విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’లో నటిస్తున్నారు.  గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. 

Updated Date - Apr 26 , 2025 | 10:52 AM