VD - Maha Kumbh: విజయ్‌ దేవరకొండ కుంభమేళా ఫొటోలు వైరల్‌

ABN , Publish Date - Feb 17 , 2025 | 05:24 PM

టాలీవుడ్‌ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల మహా కుంభమేళాలో (Maha Kumbh -2025) పాల్గొన్న సంగతి తెలిసిందే! తల్లి మాధవితో (Madhavi) కలిసి ఆయన ప్రయాగ్‌రాజ్‌ వెళ్లి  పుణ్యస్నానమాచరించారు.



టాలీవుడ్‌ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల మహా కుంభమేళాలో (Maha Kumbh -2025) పాల్గొన్న సంగతి తెలిసిందే! తల్లి మాధవితో (Madhavi) కలిసి ఆయన ప్రయాగ్‌రాజ్‌ వెళ్లి  పుణ్యస్నానమాచరించారు. అనంతరం ఆయన కాశీ విశ్వనాథుని దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఉద్దేశించి తాజాగా ఆయన ఎక్స్‌ వేదికగా ఫొటోలు షేర్‌ చేశారు. కాశీలో అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి దర్శకుడు వంశీ పైడిపల్లి, స్నేహితులతో ఫొటోలు దిగారు. ‘‘2025 కుంభమేళా మన సంస్కృతి సంప్రదాయాలతో మమేకమవుతూ సాగిన ప్రయాణం. ఇందులో నా బృందంతో ఎన్నో మధుర జ్ఞాపకాలు పొందుపరచుకున్నాను. అమ్మతో కలిసి పూజల్లో పాల్గొనడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అదే విధంగా నాకెంతో ఇష్టమైన స్నేహితులతో కాశీకి వెళ్లొచ్చాను’’ అని విజయ్‌ దేవరకొండ రాసుకొచ్చారు. Vijay Devarakonda in Maha kumbh)


మరోవైపు, మహాకుంభమేళా లో సినీ తారలు భారీగా పాల్గొని పుణ్య స్నానమాచరించారు. తాజాగా అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ రెడ్డి కూడా ఇటీవల కాశీ వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి కాశీ విశ్వనాథుని సందర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అవుతున్నారు. .

విజయ్‌ దేవరకొండ వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా ‘కింగ్‌డమ్‌’పైనే (Kingdom)ఉంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విజయ్‌ దేవరకొండ నటిస్తున్న 12వ (VD12)చిత్రమిది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం.  

Updated Date - Feb 17 , 2025 | 05:26 PM