VD12 - Naga Vamsi: దర్శకుడికి హింస చూపించి.. టైటిల్ ఫైనల్ చేశా

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:34 PM

విజయ దేవరకొండ  12వ  సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపారు నిర్మాత నాగ వంశీ. ఈ సినిమా టైటిల్‌ సెలక్షన్‌పై కొన్నాళ్లగా చర్చ జరుగుతోంది. ఆ సస్పెన్స్‌కు నిర్మాత తెరదించారు. 

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్‌కు 12వ (VD12)చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత ఆసక్తికర ట్వీట్‌ చేశారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సినిమా టైటిల్‌ సెలక్షన్‌పై కొన్నాళ్లగా చర్చ జరుగుతోంది. ఆ సస్పెన్స్‌కు నిర్మాత తెర దించారు. సినిమా టైటిల్‌ ఫిక్స్‌ అయిందని త్వరలో టెటిల్‌ లుక్‌ను విడుదల చేస్తామని తెలిపారు.  

"ఈ సినిమా టైటిల్‌ కోసం కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో అభిమానులు పెట్టే పోస్ట్‌లు,  గౌతమ్‌ని నేను పెట్టిన హింసతో ఓ టైటిల్‌ లాక్‌ చేశాము. అతి త్వరలోనే రివీల్‌ చేస్తాం’’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ సినిమాకు ుసామ్రాజ్యం, ద ఎంపైర్‌ అనే టైటిల్‌ అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు. మేలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - Jan 31 , 2025 | 04:40 PM