Santhana Prapthirasthu: గర్భగుడి వెల్ నెస్ సెంటర్..  డాక్టర్ భ్రమరం   

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:09 AM

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు

విక్రాంత్(Vikranth), చాందినీ చౌదరి (Chandini chowdary) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు' (Samthana praptirastu)  మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్ తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం ఈ సినిమా నుంచి వెన్నెల కిషోర్ (Vennela Kishore) నటించిన డాక్టర్ భ్రమరం (Dr Bramaram) క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.


ww---2.jpg

డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించనున్నారు. గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం తన దగ్గరకు సంతాన లేమి సమస్యలతో వచ్చే వారిని ఆయుర్వేద వైద్యాన్ని మోడరన్ మందులతో కలిపి ఎలా ట్రీట్ చేశారు అనేది హిలేరియస్ గా ఉండబోతోంది. డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్, కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని థియేటర్స్ లో నవ్వుల్లో ముంచెత్తనుంది.  ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

 

Updated Date - Feb 10 , 2025 | 11:31 AM