Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం... మరో రేర్ రికార్డ్!

ABN , Publish Date - Mar 04 , 2025 | 11:11 AM

సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంది. 92 కేంద్రాలలో ఈ సినిమా యాభై రోజులు ఆడిందని నిర్మాతలు తెలిపారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) మూవీ మరో రేర్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. జనవరి 15న జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. థియేటర్ వర్షన్ కంటే ఓటీటీలో ఎనిమిది నిమిషాల నిడివిని తగ్గించారు. అయితే... కొన్ని సినిమాలను థియేటర్లలో చూస్తే కలిగే అనుభూతి వేరు. బహుశా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీని సైతం థియేటర్లలో జనాల మధ్య చూస్తేనే బాగుంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయి ఉండొచ్చు. అందువల్ల ఇప్పటికీ ధియేట్రికల్ రన్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా ఉందీ సినిమా వ్యవహారం.


'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఓ పక్క ఓటీటీలో సందడి చేస్తున్నా... ఏకంగా 92 కేంద్రాలలో ఇప్పటికీ ఆడుతోంది. 50వ రోజు నాటికి ఇన్ని కేంద్రాలలో ఓ ప్రాంతీయ చిత్రం థియేటర్లలో ఉండటం ఓ రకంగా విశేషమనే చెప్పాలి. సినిమా ప్రదర్శితమౌతున్న 92 సెంటర్స్ జాబితాను నిర్మాతలు ప్రకటించారు. కానీ ఏ యే కేంద్రాలలో ఇది డైరెక్ట్ గా యాభై రోజులుగా ఆడుతోంది, ఏవేవి షిఫ్టింగ్ థియేటర్స్ అనే వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఇప్పటికే థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి, సీనియర్ స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్ లో అగ్రస్థానంలో నిలిచింది. విక్టరీ వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించగా, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు.

Also Read: Film Industry: శ్రీదేవి, కేదార్ మరణాలు దుబాయ్ లో ఫిబ్రవరిలోనే...

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2025 | 11:11 AM