Sankranthiki Vasthunam: ఓవర్సీస్‌లో కుమ్మేస్తున్న వెంకీ మామ
ABN , Publish Date - Jan 14 , 2025 | 11:15 AM
Sankranthiki Vasthunam: ఈ సంక్రాంతికి వెంకీ మామ ర్యాంపేజ్ మొదలైంది. ఆల్రెడీ కలెక్షన్ల సునామీ షురూ చేశాడు.
ఈ సంక్రాంతికి వెంకీ మామ ర్యాంపేజ్ మొదలైంది. ఆల్రెడీ కలెక్షన్ల సునామీ షురూ చేశాడు. విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతికి కానుకగా నేడు(మంగళవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా కొన్ని గంటల్లోనే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను కొల్లగొడుతుంది.
ఈ సినిమా విడుదలైన కేవలం కొద్ది గంటల్లోనే ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 350K డాల్లర్స్ వసూళ్లను సాధించింది. విషయాన్నీ మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల నుండి భారీ కలెక్షన్స్ కురిసే అవకాశముంది. మరికొందరు ఈ సినిమాని సంక్రాంతి విజేతగా ఫిక్స్ చేశారు. ప్రతి సంక్రాంతి ఆనవాయితీ మాదిరిగానే ఈ సారి కూడా చివరగా రిలీజ్ అయినా సినిమా కలెక్షన్స్ తన్నుకుపోతుంది.
ఇప్పటికే ట్విట్టర్ యువత ఈ సినిమాకి మంచి మార్క్స్ వేస్తూ.. "ఈ సినిమా కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అన్ని చోట్ల నుండి టాక్. బుల్లి రాజు పాత్రలో వెంకీ ఆకట్టుకున్నాడు అంటున్నారు. ప్రత్యేకంగా మ్యూజిక్ సినిమాని ఎలివేట్ చేసిందని టాక్. ఇక క్రాఫ్ట్ పరంగా చూసుకుంటే సినిమా డీసెంట్ గానే ఉందని చెబుతున్నారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి తన రొటీన్ కామెడీ ట్రాక్ ను మరోసారి అప్లై చేసినట్లు' చెబుతున్నారు.