Venkatesh: వెంకీ మాటలు వింటే.. ఆల్రెడీ పండుగ స్టార్ట్ అయినట్లే
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:51 AM
Venkatesh: తాజాగా నిజామాబాద్ లో నిర్వహించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ మాటలు వింటే.. ఆల్రెడీ సంక్రాంతి పండుగ స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది. అంతగా ఆయన ఏం మాట్లాడారు అంటే..
విక్టరీ వెంకటేష్, బ్లాక్బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. భీమ్స్ సంగీతం అందించారు. నిజామాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో వెంకీ మామ అభిమానుల్లో కిక్కెకించారు.
ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. " మీ అందరిని చూస్తుంటే, మీ మధ్యకు వచ్చి మటన్ తింటూ, కల్లు తాగుతూ సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తోంది. అయితే, నేను ఆవిధంగా రాలేను కాబట్టి... అందరూ నేను వచ్చినట్లే ఊహించుకుని ఎంజాయ్ చేయండి. నిజామాబాద్ లో మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషం కలిగించింది. నాపై మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నా కెరీర్ ప్రారంభం నుంచి ప్రేమ చూపిస్తూ, నా సినిమాలు సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇందాక ఏవీ (AV) చూశాను... నాకే గుర్తులేదు కానీ చాలా హిట్లు వచ్చాయి... థాంక్యూ సో మచ్. బొబ్బిలి రాజా, పెళ్లికాని ప్రసాదు, గణేశ్, చంటి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఎఫ్2, దృశ్యం, నారప్ప వరకు అనేక చిత్రాలు, పాత్రలు నా కెరీర్ లో ఉన్నాయి.
ఇప్పుడు నేను నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసేందుకు మీరు మీ కుటుంబం మొత్తంతో కలిసి రావాలి. తప్పకుండా మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు. పూర్తి వినోదం, ఎక్సట్రార్డినరీ సాంగ్స్, సూపర్బ్ యాక్షన్, సూపర్బ్ డైలాగ్స్... ఓవరాల్ ఒక సంపూర్ణ వినోదాత్మక చిత్రం ఇది. దిల్ రాజు వాళ్ల బ్యానర్ లో నాలుగు చిత్రాలు చేశాను. అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. ఆయన బ్యానర్లో మరెన్నో చిత్రాలు చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో ఐశ్వర్య నా భార్యగా, మీనాక్షి నా ప్రేయసిగా నటించారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి... పెళ్లాలకు అల్జీమర్స్ జబ్బు వచ్చినా ఫ్లాష్ బ్యాక్ లు మాత్రం మర్చిపోరు. దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్ లు పెళ్లాలకు చెప్పొద్దు. బజ్జీ అయిపోతారు... ఉతికేస్తారు... చాలా జాగ్రత్తగా ఉండండి" అంటూ వెంకీ తన మార్క్ కామెడీతో అదరగొట్టారు.