Daggubati Venkatesh: వెంకీ మామ నీ ఓపికకు దండం..
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:24 PM
విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా ఈ మూవీ హీరో విక్టరీ వెంకటేష్ రామానాయుడు స్టూడియోస్ లో చేసిన పనికి షాక్ అవుతారు.
విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూవీ నుండి ఇప్పటి వరకు విడుదలైన అన్ని పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో దూసుకెళ్తుంది. తాజాగా ఈ మూవీ హీరో విక్టరీ వెంకటేష్ రామానాయుడు స్టూడియోస్ లో చేసిన పనికి షాక్ అవుతారు.
'సంక్రాంతికి వస్తున్నాం' ప్రమోషన్స్ లో ఆయన హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో తన అభిమానులను కలిశాడు. ఇందులో గొప్పేముంది. ఏ హీరో అయిన తన అభిమానులను కలుస్తాడు కదా అంటారా. అయితే అందరికి భిన్నంగా వెంకీ మామ 3000+ అభిమానులకు గంటలు తరబడి నిల్చొని సెల్ఫీలు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విజువల్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. దీంతో వెంకీ మామ నీ ఓపికకు దండం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ ఎక్స్‌గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. వెంకటేష్, మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి తదితరులు నటించారు.