Victory Venkatesh Remuneration: టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్.. రెమ్యునరేషన్‌పై వెంకీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 23 , 2025 | 05:28 PM
Venkatesh: టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాతలపై రెండు మూడు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోల రెమ్యునరేషన్‌పై హాట్ హాట్‌గా కామెంట్స్ వినబడుతున్నాయి. హీరోలు బ్లాక్ మానేస్తే.. మాకీ గొడవలు ఉండవనేలా నిర్మాతలు చేస్తున్న కామెంట్స్‌పై విక్టరీ వెంకటేష్ తన రెమ్యునరేషన్‌పై వివరణ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..
Venkatesh on Remuneration: టాలీవుడ్‌లో టాప్ నిర్మాతల ఇళ్లలో రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ రైడ్స్ హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ రెండు రోజుల్లో వారు ఏం పట్టుకున్నారనేది బయటికి రాలేదు కానీ.. ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా ఈ ఐటీ రైడ్స్ జరుగుతుండటం విశేషం. ఈ ఐటీ రైడ్స్‌కి సంబంధించి గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో వెంకటేష్ మాట్లాడారు. మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆయన తన రెమ్యునరేషన్ ఎలా తీసుకుంటారో చెప్పుకొచ్చారు.
Also Read- Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు తమ రెమ్యూనరేషన్‌ను మొత్తం వైట్ తీసుకుంటే.. ఏ నిర్మాత కూడా బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. హీరోలు బ్లాక్ తీసుకోకుండా ఉంటే.. ఇండస్ట్రీలో ఇంకెవరికీ మేము బ్లాక్ ఇచ్చే అవసరం లేదు. కేవలం హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది. అలా బ్లాక్ ఇచ్చినదానికి.. మేము బ్లాక్‌లో ఇంట్రస్ట్ కట్టాల్సి వస్తుందని పెద్ద నిర్మాతలు ఈ మధ్య ఎక్కువగా చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు వెంకీమామ సమాధానమిస్తూ..
Also Read- Pushpa 2 OTT Release Date: ‘పుష్ప 2’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా.. ఓటీటీ లవర్స్ కోసం మరో ట్రీట్?
‘‘మిగతావారి సంగతి నాకు తెలియదు కానీ.. నేను ఫుల్ వైట్. వైట్ లో వైట్ అంతే. నేను తీసుకునేదే కొంచెం. నేను ఎక్కువ తీసుకోను.. తీసుకునేది మొత్తం వైటే తీసుకుంటాను..’’ అని చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు కూడా వెంకటేష్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు. నేను తీసుకునేదే చాలా తక్కువ. అందులోనూ మళ్లీ కొందరు నిర్మాతలు పూర్తిగా ఇవ్వరు. అదని, ఇదని చెబుతుంటారు.. పోనీలే అని నేను కూడా పెద్దగా పట్టించుకోను అని గతంలో తన రెమ్యూనరేషన్‌పై వెంకీ వివరణ ఇచ్చారు. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో పొంగల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని చిత్రయూనిట్ బాక్సాఫీస్ సంభవం పేరుతో మీడియా సమావేశాన్ని నిర్వహించింది.