Venkatesh: కుర్ర హీరోలు.. చూసి నేర్చుకోండయ్యా..
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:22 PM
ఈవెంట్ ఏదైనా బాలీవుడ్‌లో కుర్ర, పెద్ద హీరోలంతా వేదికపై డాన్స్ అంటే అంతకుమించి అన్నట్లు సందడి చేస్తుంటారు. ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపుతారు. కానీ టాలీవుడ్‌లో అలా కాదు..
వేదికలపై మాట్లాడటం తప్పితే.. యువత, అభిమానులను ఉత్సాహపరచడం కోసం కాలు కదపడం, నాలుగు స్టెప్పులు వేయడం వంటి అలవాటు టాలీవుడ్ (Tollywood heros) హీరోలకు తక్కువ. ఈవెంట్ ఏదైనా బాలీవుడ్‌లో కుర్ర, పెద్ద హీరోలంతా వేదికపై డాన్స్ అంటే అంతకుమించి అన్నట్లు సందడి చేస్తుంటారు. ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపుతారు. కానీ టాలీవుడ్‌లో అలా కాదు.. వేదిక ఎక్కితే పవర్‌ఫుల్ స్పీచ్‌లు ఉంటాయి కానీ ఇలా డాన్స్‌లు వేసి డబుల్ ఎనర్జీ క్రియేట్ చేయడానికి మొహమాటపడతారు. ఆ నలుగురు హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ అప్పుడప్పుడు స్టేజ్‌పై స్టెప్పులేస్తూ ఆహుతుల్లో ఉత్సాహం నింపుతుంటారు. ఆకేషనల్‌గా వెంకీ (Venkatesj Dance) కూడా చేస్తుంటారు. నాగార్జున వీటన్నింటికీ కాస్త దూరం. అయితే తర్వాతి జనరేషన్ హీరోల్లో అది ఎక్స్‌పెక్ట్ చేయనక్కర్లేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరోలు వేదికపై ఎంత సందడి కావాలంటే అంతా చేస్తారు. చిరంజీవి (Chiranjeevi) జనరేషన్ హీరోల్లో వెంకటేశ్ (Venkatesh) మాత్రం ఈసారి టాప్ లేపేశారు. డాన్స్ కాదు అంతకుమించి అంటూ దుమ్ములేశారు. కుర్ర హీరోలు కాదు.. నేనే కుర్రాడిని అన్నట్లు వేదికపై చెలరేగిపోయారు.
READ MORE: Sai Durga Tej: మీ సాయం ఓ పాపకు బతుకునిస్తుంది..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా వెంకటేశ్ నటించగా సంక్రాంతి బరిలో విడుదలై భారీ విజయం సొంతం చేసుకున్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా సాంగ్స్ విడుదల నుంచి ఇటీవల భీమవరంలో జరిగిన బ్లాక్‌బస్టర్ సంబరం (Sankranthiki Block buster Sambaram) వరకూ ప్రతి వేదికపైనా వెంకటేశ్ దుమ్ము దులిపేశారు. ఈ చిత్రంలో 'నేను పాడతా.. నేను పాడతా' అంటూ దర్శకుడిని హింసించి 'బ్లాక్‌బస్టర్ సంక్రాంతి’ పాటను పాడిన సంగతి తెలిసిందే. సినిమా వేదికలపై 'నేను ఆడతా.. నేను ఆడతా' అంటూ చెలరేగిపోయారు.
అంతే కాదు.. పాడుతూ ఇద్దరు హీరోయిన్లు, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి, ఇతర సినిమా టీమ్‌తో కలిసి హుందాగా స్టెప్పులేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వెంకీ వేసిన స్టెప్పుల ప్రస్తావనే. వేలల్లో రీల్స్ కూడా క్రియేట్ చేశారు. దీంతో రీల్స్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు నెటిజన్లు కుర్ర హీరోలు వెంకీ ఎనర్జీని చూసి నేర్చుకోండయ్యా’ అని హితవు పలుకుతున్నారు. నిజం చెప్పాలంటే.. సినిమాలో బుల్లిరాజు పాత్రధారి రేవంత్ ఎంత అల్లరి చేశాడో వెంకటేశ్ కూడా వేదికపై అంతకుమించి అల్లరి చేశారనడానికి వైరల్ అవుతున్న వీడియోలే నిదర్శనం. వెంకీ ఎనర్జీ చూసైనా ఈ తరం హీరోలు మారతారేమో చూడాలి.
READ MORE: Vijay Sethupathi: గందరగోళానికి గురి కాకుండా దయచేసి ఆ మార్పు చేయండి..