VD12: విజయ్, గౌతమ్ తిన్ననూరి టైటిల్ వచ్చేసింది
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:23 PM
విజయ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకు 'కింగ్‌డమ్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటు బుధవారం నాడు టీజర్ ను కూడా ఆవిష్కరించారు.
విజయ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి (goutham Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకు 'కింగ్‌డమ్' (Kingdom) అనే టైటిల్ ఖరారు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
టైటిల్ తో పాటు బుధవారం నాడు టీజర్ ను కూడా ఆవిష్కరించారు. ఈ సినిమా టీజర్ తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి, టీజర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లారు.
"కింగ్‌డమ్' (kingdom) చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. సినిమాని వేరే స్థాయికి తీసుకొని వెళ్ళడానికి తన వైపు నుంచి నూటికి నూరు శాతం కృషి చేస్తున్నారు. విజయ్ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే, దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి ఉండటం సహజం. 'కింగ్‌డమ్' టీజర్ విడుదల తేదీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి, ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూశారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ కట్టిపడేసింది" అని నిర్మాతలు అన్నారు
'జెర్సీ'వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త అవతార్‌లో చూపిస్తున్నారు. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ తనదైన నేపథ్య సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. టీజర్ లో విజయ్ పాత్రను దర్శకుడు చూపించిన తీరు, దానిని తన సంగీతంతో అనిరుధ్ మరో స్థాయికి తీసుకువెళ్లిన తీరు అద్భుతం. ఛాయాగ్రాహకులు జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితనంతో చిత్రానికి మరింత అందం తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాకి ఎడిటర్ గా నవీన్ నూలి, కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. 2025, మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో 'కింగ్‌డమ్' విడుదల కానుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.