Varun Tej 15: ఇండో కొరియన్ హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:25 AM
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (varun Tej) హీరోగా నూతన చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది.
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (varun Tej) హీరోగా నూతన చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. మేర్లపాక గాంధీ (merlapaka gandhi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండో - కొరియన్ హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్, యు.వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రితికా నాయక్ కథానాయిక. వరుణ్ తేజ్ హీరోగా 15వ (VT15 Movie) చిత్రమిది.
ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు’ (Korean kanakaraju) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాని ఎస్‌ఎస్. తమన్ సంగీతం అందించనున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనుంది. ఆపరేషన్ వాలంటైన్, మట్కా చిత్రాలతో పరజయం చవిచూసిన మెగా ప్రిన్స్ ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసిగా ఉన్నారు. దానికి తగ్గట్టే మేర్లపాక గాంధీ కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.