Varun Tej: కదిరి నరసింహ సామి సాక్షిగా వరుణ్ తేజ్ ఏం అన్నాడంటే..

ABN , Publish Date - Jan 19 , 2025 | 03:58 PM

Varun Tej: గతేడాది రిలీజ్ అయినా 'మట్కా' సినిమాని మెగా ఫ్యాన్స్ అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తాజాగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. మట్కాలో నేషనల్ టచ్ ఇచ్చిన ఆయన ఈసారి ఇంటర్నేషనల్ టచ్ ఇవ్వనున్నాడు.

Varun Tej 15th Movie Announcement

ప్రస్తుతం టాలీవుడ్ లోని యంగ్ హీరోస్ వరుస ప్లాప్స్ తో సతమతవుతున్న హీరోలలో ఒకడు వరుణ్ తేజ్. ప్రమోషన్స్ లో ఎన్ని రకాలుగా అయినా ప్రయత్నించిన మూడేళ్ళ నుండి ఆయనకు ఒక్క హిట్టు సినిమా లేదు. గతేడాది రిలీజ్ అయినా 'మట్కా' సినిమాని మెగా ఫ్యాన్స్ అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తాజాగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. మట్కాలో నేషనల్ టచ్ ఇచ్చిన ఆయన ఈసారి ఇంటర్నేషనల్ టచ్ ఇవ్వనున్నాడు. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటంటే..


2018లో రిలీజ్ అయినా 'తొలిప్రేమ' సినిమా మంచి విజయాన్ని అందుకోగా మ్యూజిక్ మాత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సంగీతం అందించిన థమన్ తో ఆయన మరోసారి జతకడుతూ తన కెరీర్ లో 15వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈరోజు వరుణ్ 35వ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ పేరు 'కొరియన్ కనకరాజు'. ఈ సినిమాకి 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'కృష్ణార్జున యుద్ధం', 'ఏక్ మినీ కథ', 'మాస్ట్రో', 'లైక్, షేర్ & సబ్స్క్రైబ్' వంటి చిత్రాలు తెరకెక్కించిన గాంధీ మేర్లపాక దర్శకత్వం వహించనున్నాడు. దీనిని వరుణ్ షేర్ చేస్తూ.. 'కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా' అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ రాశారు. ఈ సినిమాని యువి క్రియేన్షన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ ఇండో కొరియన్ డ్రామాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది.

GhpPRzRWIAA6P52.jpg



Also Read-
Manchu Manoj: నా పోరాటం ఎందుకంటే.. ఓహో ఇదన్నమాట అసలు విషయం!

Also Read-Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!

Also Read-Madhavi Latha: ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా.. మాధవీ లత షాకింగ్ కామెంట్స్

Also Read:Manchu Manoj: సింగిల్‌గా వస్తా.. ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 19 , 2025 | 04:36 PM