Varalaxmi Sarathkumar: వరలక్ష్మీ శరత్ కుమార్‌కి ఇంకోటి ఓకే అయ్యింది..
ABN , Publish Date - Jan 29 , 2025 | 10:38 AM
హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా.. ఇలా వైవిధ్యమైన పాత్రలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. తన వివాహం అనంతరం కూడా యాక్టింగ్ చేస్తూనే ఉన్నారు. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న ఆమెకు.. లీడ్ రోల్‌లో నటించే ఓ సినిమా అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగు, తమిళ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా మారిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). రీసెంట్‌గా ఆమె నటించిన ‘మదగజరాజ’ చిత్రం దాదాపు 12 సంవత్సరాల తర్వాత విడుదలై.. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఆ సినిమా రూ. 50 కోట్లకి పైగా కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదలయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 31న ఈ చిత్రాన్ని తెలుగు విడుదల చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు వరలక్ష్మీ శరత్ కుమార్‌కు బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది.
Also Read- Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా.. తన వైవిధ్యమైన నటన, హీరోయిన్, విలన్ పాత్రలతో ఆకట్టుకుంటూ.. నటిగా తన సత్తా చాటుతోంది వరలక్ష్మి. నటిగా సౌతిండియా భాషల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని, పెళ్లి తర్వాత కూడా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న వరలక్ష్మి ఇప్పుడు ‘ఆదిపర్వం’ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శత్వంలో ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం.
సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్టు కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ఓకే చెప్పిందని, ఇందులో వరలక్ష్మి మెయిన్ లీడ్ పాత్ర చేయనుందని టాక్ నడుస్తుంది. భారీ బడ్జెట్‌తో డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారని తెలుస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్‌గా.. మంచు లక్ష్మీతో ‘ఆదిపర్వం’ చిత్రాన్ని రూపొందించిన సంజీవ్ మేగోటి తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.