Love Stars : వేలంటైన్స్ డే స్పెషల్ ... లవ్ స్టార్స్
ABN , Publish Date - Feb 14 , 2025 | 08:08 AM
'ప్రేమే దైవం' అని చాటుతూ ప్రేమించండి అంటూ ప్రబోధించాడు సెయింట్ వేలంటైన్... ఆయనను స్మరిస్తూ ప్రతి యేటా ఫిబ్రవరి 14న 'వేలంటైన్స్ డే' సాగుతోంది... అదే ప్రేమికుల రోజుగా వర్ధిల్లుతోంది... వేలంటైన్స్ డే (Valentine's Day) సందర్భంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న సినిమా జంటలను గుర్తు చేసుకుందాం...
'ప్రేమే దైవం' అని చాటుతూ ప్రేమించండి అంటూ ప్రబోధించాడు సెయింట్ వేలంటైన్... ఆయనను స్మరిస్తూ ప్రతి యేటా ఫిబ్రవరి 14న 'వేలంటైన్స్ డే' సాగుతోంది... అదే ప్రేమికుల రోజుగా వర్ధిల్లుతోంది... వేలంటైన్స్ డే (Valentine's Day) సందర్భంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న సినిమా (Film stars) జంటలను గుర్తు చేసుకుందాం...
నటశేఖరుని 'విజయ' రహస్యం! (Krishna)
మన టాలీవుడ్ లో లవ్ పెయిర్స్ పేరు చెప్పగానే చప్పున గుర్తుకు వచ్చే జంట కృష్ణ (Krishna)- విజయనిర్మల (Vijayanirmala) అనే చెప్పాలి... ప్రస్తుతం వారిద్దరూ మన మధ్య లేకపోయినా, తెలుగు జనం మదిలో మాత్రం సుస్థిరస్థానం సంపాదించారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలచిన ఈ జంట ఇద్దరూ సినిమా రంగంలో రికార్డులు సృష్టించిన వారే కావడం విశేషం! తెలుగునాట అత్యధిక చిత్రాలలో నటించిన హీరోగా కృష్ణ సాగితే, ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు తీసిన లేడీ డైరెక్టర్ గా విజయనిర్మల గిన్నిస్ బుక్ లోనూ చోటు సంపాదించారు. అందువల్లే తెలుగు జనం కృష్ణ-విజయనిర్మల జంటను ఎన్నటికీ మరచిపోలేరు. అంతేనా! వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఓ రికార్డ్ - కృష్ణ, విజయనిర్మల జంటగా 40కి పైగా చిత్రాలు వెలుగు చూశాయి... టాలీవుడ్ లో అన్ని చిత్రాలలో నటించిన జోడీ మరొకటి కానరాదు.
నాన్న బాటలోనే నాని! (Mahesh - Namratha)
వెండితెరపై తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న మహేశ్ బాబు (Mahesh Babu) కూడా నాన్న బాటలోనే పయనిస్తూ ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం! తన సరసన ఒకే ఒక్క సినిమా 'వంశీ'లో నటించిన నమ్రతా శిరోద్కర్ (Namratha Shirodkar) ను ప్రేమించి పెళ్ళాడారు మహేశ్. పెళ్ళయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పిన నమ్రత తన భర్త మహేశ్ కెరీర్ పట్ల కేర్ తీసుకుంటూ సాగుతున్నారు.
అలరించిన నాగ్-అమల (Nag - Amala)
ఏయన్నార్ (ANR) అనేక ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన నటవారసుడు నాగార్జున (Nagarjuna) రియల్ లైఫ్ లోనూ ప్రేమికుడినే అంటూ చాటుకున్నారు. తన హిట్ పెయిర్ అమల (Amala)ను పెళ్ళాడారు. నాగ్-అమల ఆన్ స్క్రీన్ రొమాన్స్ అప్పట్లో కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది.
మరికొన్ని అడుగులు...(Naga Chaitanya Sobhita)
నాగార్జున బాటలో ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య (Naga Chaitanya) కూడా నడిచారు. తన హిట్ పెయిర్ గా ఉన్న సమంత (Samantha) ను ప్రేమించి పెళ్ళాడిన చైతన్య తరువాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ మధ్యే మరో నటి శోభిత ధూళిపాల (Shobitha Dhulipala)ను కూడా ప్రేమించే పెళ్ళి చేసుకోవడం విశేషం! శోభితను ముద్దుగా 'బుజ్జితల్లీ...' (Bujji Talli...) అంటూ పిలుస్తుంటాడట నాగచైతన్య. అందువల్ల తన 'తండేల్' (Thandel) సినిమాలోని 'బుజ్జి తల్లి...' సాంగ్ చైతూ, శోభిత జంటకు ఫేవరెట్ గా మారడమూ ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
అతడు... ఆమె... Jeevitha, Rajasekhar)
రీల్ లైఫ్ లోనూ, రియల్ లైఫ్ లోనూ సంసారంలో సరిగమలు పలికించిన వారిలో రాజశేఖర్ (Rajasekhar) - జీవిత (Jeevitha) జోడీ కూడా ఉంది. రాజశేఖర్ కు యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ ను సొంతం చేసిన చిత్రాలలో జీవిత నాయికగా నటించి అలరించారు. రాజశేఖర్ కెరీర్ లో ఓ ఆల్ టైమ్ హిట్ గా నిలచిన 'అంకుశం' (Ankusham) లోనూ జీవిత నాయికగా నటించడం విశేషం.
ఊహల పల్లకిలో...(Srikanth - Uha)
తన సీనియర్స్ బాటలోనే పయనిస్తూ ఓ నాటి హీరో, ఈ నాటి కేరెక్టర్ యాక్టర్ శ్రీకాంత్ (Srikanth) కూడా లవ్ మేరేజ్ తో సందడి చేశారు. తన సరసన కొన్ని చిత్రాలలో నాయికగా నటించిన ఊహ (Ooha) ను ప్రేమించి పెళ్ళాడారు శ్రీకాంత్. పెళ్ళయిన తరువాత ఊహ నటనకు గుడ్ బై చెప్పేశారు.
నవతరంలో... (Varuj Tej - Lavanya Tripati)
ఈ మధ్యకాలంలోనూ యంగ్ హీరోహీరోయిన్స్ సైతం ప్రేమయాత్రలు చేసి పెళ్ళి చేసుకున్నవారు ఉన్నారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), రహస్య (Rahasya) - వరుణ్ సందేశ్ (Varun Sandesh), వితికా షేరూ (Vitika Sheroo) - ఆది పినిశెట్టి (Adi Pinisetty), నిక్కీ గల్రానీ (Nicky Galrani) కనిపిస్తారు. ఈ కోవలోనే తనకూ చోటు ఉందని చాటుకున్నారు మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ (Varuntej). తన సరసన రెండు సినిమాల్లో నటించిన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ని ప్రేమించి పెళ్ళాడారు వరుణ్ తేజ్. ఈ యంగ్ పెయిర్స్ తో పాటు మరికొందరు టాలీవుడ్ జోడీలు కూడా ఆనందంగా సంసార సాగరంలో తేలిపోతున్నారు.
తెలుగువారిని అలరించిన బాలీవుడ్ తారలూ తమ ప్రేమకథలతో మురిపించారు. వారిలో కొందరిని గుర్తు చేసుకుందాం. బాలీవుడ్ కు వస్తే -
ధర్మేంద్ర (Dharmendra) - హేమామాలిని (Hemamalini),
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) - జయబాధురి (Jayabadhuri),
అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) - ఐశ్వర్యారాయ్
రణబీర్ కపూర్ (Ranabir Kapoor) - అలియా భట్ (Alia Bhatt),
రణవీర్ సింగ్ - దీపికా పదుకొణే (Deepika Padukone),
అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నా,
అజయ్ దేవగణ్ - కాజోల్ (Kajol),
షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్, సైఫ్
అలీఖాన్ - కరీనా కపూర్,
రితేశ్ దేశ్ ముఖ్ - జెనీలియా,
సిద్ధార్థ్ మల్హోత్ర - కియారా అద్వాణీ (Kiara Adwani),
విక్కీ కౌశల్ -కత్రినా కైఫ్ (Katrina Kaif)- ఇలాంటి జంటలు మరెన్నో రాబోయే రోజుల్లో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే అవకాశం ఉంది.