Jack konchem krack : వావ్ అనిపిస్తున్న వైష్ణవి
ABN , Publish Date - Jan 04 , 2025 | 07:31 PM
బేబి(Baby), లవ్ మీ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఇప్పుడు మరో క్రేజీ సినిమాలో సరికొత్త పాత్రతో మెప్పించటానికి సిద్ధమవుతున్నారు.
బేబి(Baby), లవ్ మీ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఇప్పుడు మరో క్రేజీ సినిమాలో సరికొత్త పాత్రతో మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘జాక్- కొంచెం క్రాక్’ (Jack konchem krack) . డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న సినిమా ఇది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు (Siddhu Jonnalagadda) జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా అలరించనుంది.
శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు విషెష్ తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. 'జాక్ - కొంచెం క్రాక్' చిత్రంలో ఆమె రోల్ మరింత డిఫరెంట్‌గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ‘ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఫన్ రైడర్‌లో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. అచ్చు సంగీతం అందిస్తున్నారు. రాజమణి సంగీత సారథ్యం వహిస్తున్నారు.