Urvasi routela: ‘దబిడి దిబిడి’ వివాదం.. హీరోయిన్ స్పందన ఇదే..
ABN , Publish Date - Jan 16 , 2025 | 09:52 AM
సంక్రాంతి బరితో విడుదలై విజయం సాధించింది ‘డాకు మహారాజ్’. ఇందులో ఊర్వశీ రౌతేలా - బాలకృష్ణలపై తెరకెక్కిన ‘దబిడి దిబిడి’ సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి బరితో విడుదలై విజయం సాధించింది ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). ఇందులో ఊర్వశీ రౌతేలా(urvasi routela) - బాలకృష్ణలపై (NBK) తెరకెక్కిన ‘దబిడి దిబిడి’ (Dabidi Dibidi song) సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ఓ స్టెప్ వివాదాస్పదమైన విషయమూ తెలిసిందే! తాజాగా దీనిపై ఊర్వశీ రౌతేలా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ‘‘ఒక సినిమా విజయం సాధించినప్పుడు దానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను. బాలకృష్ణతో డ్యాన్స్, నటనకు ప్రాధాన్యం ఉండే ఎలాంటి బిన్నమైన సినిమాలనైనా నేను గౌరవిసాను. ఆయన లెజెండ్. ఆయనతో కలిసి వర్క్ చేేస అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఇదంతా కళలో భాగం. బాలకృష్ణతో డ్యాన్స్ చేయడం కేవలం పెర్ఫామెన్స్ కాదు.. కళపై నాకున్న గౌరవానికి చేసుకున్న వేడుకగా భావిస్తాను. ఆయనతో పనిచేయడం నా కల. అది ఈ సినిమాతో నెరవేరింది. ఆయన ఆర్టిస్టులకు ఎంతో సపోర్ట్ చేస్తారు’’ అని అన్నారు.
ఈ పాట విడుదలైనప్పుడు వచ్చిన ట్రోల్స్‌పై కూడా ఊర్వశీ ఇటీవల స్పందించారు. ‘జీవితంలో ఏం సాధించలేని కొందరు.. కష్టపడే వారిని విమర్శించే అర్హత ఉందనుకుంటారు. రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు.. వారి గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకోవడం’ అని ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ఈ చిత్రం రూ.56 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో ‘డాకు మహారాజ్’ చేరింది.