Urvashi Rautela: దబిడి దిబిడిపై మరోసారి ఊర్వశీ స్పందన

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:34 PM

‘డాకు మహారాజ్‌’లో నందమూరి బాలకృష్ణతో కలిసి నటించారు ఊర్వశీ రౌతేలా.  ఇందులో బాలయ్యతో కలిసి ఆమె ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ పాట విడుదలైన సమయంలో కొరియోగ్రఫీపై వచ్చిన కాంట్రవర్సీ గురించి తాజాగా ఊర్వశీ రౌతేలా స్పందించారు.

‘డాకు మహారాజ్‌’లో(Daaku Maharaj) నందమూరి బాలకృష్ణతో (Balakrishna) కలిసి నటించారు ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela).  ఇందులో బాలయ్యతో కలిసి ఆమె ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ పాట విడుదలైన సమయంలో కొరియోగ్రఫీపై వచ్చిన కాంట్రవర్సీ గురించి తాజాగా ఊర్వశీ రౌతేలా స్పందించారు. ప్రేక్షకుల నుంచి ఈవిధమైన స్పందన  ఊహించలేదన్నారు.  ఆ పాట, అందులోని స్టెప్పులను ప్రేక్షకులు ఆదరిస్తారనుకున్నానని అన్నారు. కానీ, ఈ విధంగా విమర్శల పాలు చేస్తారని ఊహించలేదన్నారు.  


ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘రిహార్సల్స్‌ అంతా కూల్‌గా జరిగింది. అన్ని పాటలకు  ఎలా కొరియోగ్రఫీ ఉంటుందో అదే విధంగా ఈ పాటకూ చేశాం. శేఖర్‌ మాస్టర్‌ ఈ పాటకు డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పటికే ఇది నాలుగోసారి ఆయనతో పని చేయడం. ఆయన స్టెప్పులు చెప్పినప్పుడు నాకు ఏ మాత్రం విభిన్నంగా లేదా అభ్యంతరకరంగా అనిపించలేదు. సాధారణమైన స్టెప్పులు మాదిరిగానే భావించా. కానీ, పాట విడుదలయ్యాక సోషల్‌ మీడియాలో వచ్చిన విమర్శలు చూసి షాకయ్యా. కొరియోగ్రఫీ ప్రేక్షకులు తప్పు పట్టడానికి కారణం ఏమిటో అంచనా వేయడానికి కూడా సమయం లేకపోయింది. అంతా సడెన్‌గా జరిగిపోయింది. రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయని మేము అస్సలు ఊహించలేదు. రిహార్సల్స్‌ క్లిప్స్‌ విడుదల చేసినప్పుడు ఎలాంటి విమర్శలు రాలేదు’’ అని ఊర్వశీ రౌతేలా తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా కొంతమంది కావాలని చేసే వ్యాఖ్యలను నేను పట్టించుకోను. వివరణాత్మక విమర్శలను స్వాగతిస్తున్నాను’’ అని అన్నారు.


Bala.jpg
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘డాకు మహారాజ్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదలైంది. ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్థా శ్రీనాథ్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఊర్వశీ రౌతేలా అతిథి పాత్ర పోషించారు. తమన్‌ స్వరకర్త. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.100 కోట్లకు పైగా ఇది వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Feb 12 , 2025 | 02:03 PM