Upasana: రామ్ చరణ్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం.. ఉపాసన 

ABN , Publish Date - Mar 29 , 2025 | 10:13 PM

గ్లోబల్ స్టార్  రామ్‌చరణ్‌కు (Ram Charan) ఆయన సతీమణి ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గ్లోబల్ స్టార్  రామ్‌చరణ్‌కు (Ram Charan) ఆయన సతీమణి ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Ram charan (4).jpgఈ వేడుకకు వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ‘మార్చి 27 ఎప్పటికీ సంతోషకరమైన రోజు. మీరంతా విచ్చేసి ఈ రోజును మరింత ప్రత్యేకం చేశారు’ అని ఉపాసన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్‌ చేశారు.

Ram charan (1).jpgచిరంజీవి, సురేఖ, సుస్మితలతో రామ్‌చరణ్‌, ఉపాసన కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. మరో ఫొటోలో చిరంజీవి, నాగార్జులతో పాటు కొందరు అతిధులు ఉన్నారు. 

Ram charan (2).jpg

ప్రస్తుతం రామ్‌చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) చిత్రంలో నటిస్తున్నారు. వింటేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా ఇది రూపొందనుంది. జాన్వీ కపూర్‌ కథానాయిక. ఉగాది కానుకగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. 

Updated Date - Mar 29 , 2025 | 10:14 PM